Hair Growth Tips: జుట్టు పొడవు పెరగడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మామిడి ఆకులతో తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టుకు వినియోగించడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును పెంచడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ మామిడి ఆకుల మిశ్రమాన్ని జుట్టుకు ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మామిడి ఆకులు జుట్టుకు ఎలా వినియోగించాలో తెలుసా?:
మామిడి ఆకులు జుట్టు పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఎ జుట్టును దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా స్కాల్ప్ నుంచి హానికరమైన బ్యాక్టీరియాను బయటకు తొలగించడానికి కూడా సహాయపడుతుంది. మామిడి ఆకుల మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వినియోగిస్తే తలలో రక్త ప్రసరణ పెంచేందుకు కూడా దోహదపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఈ మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
మామిడి ఆకుల హెయిర్ ప్యాక్‌ను ఇలా తయారు చేసుకోండి:
❁ 4 నుంచి 5 మామిడి ఆకులను బాగా శుభ్రం చేసి తీసుకోవాల్సి ఉంటుంది.
❁ తర్వాత వాటిని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
❁ అందులో 1 టీస్పూన్ పెరుగు వేసి మిశ్రమంలా తమారు చేసుకోవాలి.
❁ ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి.
❁ ఆ తర్వాత 30 నిమిషాల జుట్టుకు అలానే ఉంచాలి.
❁ ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.
హెయిర్ ప్యాక్ ప్రయోజనాలు:
❁ మామిడి ఆకుల హెయిర్ ప్యాక్‌ను వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
❁ జుట్టు నెరసిపోకుండా సహాయపడుతుంది.
❁ అంతేకాకుండా జుట్టులో ఫంగస్ ను క్లియర్ చేస్తుంది.
❁ స్కాల్ప్‌లో అలర్జీని దూరం చేయడానికి కూడా సహాయపడుతుంది.
❁ జుట్టును నల్లగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
❁ జుట్టును ఒత్తుగా చేయడానికి సహాయపడుతుంది.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి