Hair Spa With Cucumber: సమ్మర్‌లో శరీరం డీహైడ్రేషన్ కారణంగా జుట్టు పొడిగా మారుతుంది. అంతేకాకుండా అధికంగా జుట్టు రాలుతుంది. వేసవిలో చర్మ రక్షణతో పాటు జుట్టు సంరక్షణ కూడా ఎంతో అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనలో చాలా మంది హెయిర్ కేర్ అనే పేరుతో అనేక రకాల క్రీములు, ప్రొడెక్ట్స్‌లను ఉపయోగిస్తారు. దీని వల్ల ఉన్న జుట్టు కూడా రాలుతుంది. మరొకొంతమంది పార్లర్‌లో ఉపయోగించే క్రీములు కారణంగా చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో జుట్టును ఎలా సంరక్షించుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
ఎండాకాలంలో పండ్లు, కూరగాయాలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. వాటిలో కీరదోసకాయ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కీరదోసకాయను ఎక్కువగా ఆరోగ్యానికి ఉపయోగిస్తాము. కానీ ఈ కీరదోసకాయ జుట్టు సంరక్షణలో కూడా ఎంతో ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు. కీరదోసకాయతో ఇంట్లోనే హెయిర్ స్పాను చేసుకోవచ్చు. కీరాదోసకాయలో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. వీటిలో ఉండే విటిమన్‌లు,మినరల్స్ జుట్టు రాలకుండా సహయపడుతాయి.
అయితే ఈ కీరదోసకాయతో హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా కీర దోసకాయతో హెయిర్ స్పా చేయడానికి కీర ముక్కలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి రెండు స్పూన్‌ల తేనె, నాలుగు స్పూన్‌ల కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఈ పదార్థాలను వేడినీటిలో వేసి గంట పాటు ఉడికించాలి. ఆ తరువాత చల్లబరచుకోవాలి. వీటని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కీరదోసకాయ మిశ్రమాని తయారు చేసుకోవాలి.
దీని ఎలా ఉపయోగించాలి:
ఈ కీర దోసకాయ నూనెను ఉపయోగించే ముందు కొబ్బరి నూనెను బాగా వేడి చేసి జుట్టు కు మసాజ్ చేసుకోవాలి. నూనెను తలు బాగా పట్టించుకొని మసాజ్ చేసిన ముప్పె నిమిషాల పాటు వదిలివేయాలి. అరగంట తరువాత దోసకాయను ఉడికించిన నీటితో షాంపుతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. తర్వాత దోసకాయతో చేసిన హెయిర్ మాస్క్‌ను అప్లై చేసి ముప్పె నిమిషాల తరువాత కడుకోవాలి. ఈ మిశ్రమాని నెలకోసారి ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా తయారు అవుతుంది.
ఎలాంటి జుట్టు సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన, పొడవైన, దృఢమైన జుట్టు మీసొంతం అవుతుంది. ఈ చిట్కాలను ఉపయోగించడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉండే ఆహారపదార్థాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల పొడవైన జుట్టు మీసొంతం అవుతుంది.
Also Read: AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter