Black Turmeric For White Hair: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల జుట్టుకు తీవ్ర దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటికి బదులుగా హెర్బల్ హెయిర్ కలర్‌ను వాడాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. హెర్బల్ హెయిర్ కలర్స్‌లో కూడా అమ్మోనియా ఉంటుంది. జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే జుట్టు 20 రోజులకు పైగా నల్లగా ఉంచుకోవడానికి హెర్బల్ హెయిర్ డై వినియోగించాల్సి ఉంటుంది. ఈ హెయిర్ డైని వినియోగించడం వల్ల జుట్టుకు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది:
కేవలం పది రూపాయల ఖర్చుతో హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు.ఇది జుట్టును నల్లగా మార్చడంతో పాటు అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జుట్టును నిగనిగలాడేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంద జుట్టును నల్లగా చేసుకోవాడానికి హెన్నా లేదా ఇండిగో పౌడర్‌ని వినియోగిస్తున్నారు. అయితే దీని వినియోగించడం వల్ల జుట్టుకు సమస్యలు వస్తున్నాయని వీటికి బదులుగా పసుపును జుట్టుకు వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే పసుపును ఎలా జుట్టుకు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపులో రెండు రకాలు ఉన్నాయి:
పసుపు కూడా రెండు రకాలు ఉన్నాయి. అయితే జుట్టుకు వినియోగించడానికి మార్కెట్‌లో లభించే నల్ల పసుపును వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇది ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా లభిస్తోంది. నల్ల పసుపును జుట్టుకు ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.
పసుపు పసుపుతో నల్ల జుట్టు రంగును ఎలా తయారు చేయాలి:
ఇనుప పాన్‌లో నల్ల పసుపు పొడిని వేయించాల్సి ఉంటుంది. చల్లారిన తర్వాత, కొబ్బరి లేదా కలబంద జెల్‌తో మిక్స్ చేసి మీ జుట్టుకు పట్టించాలి. ఆరిన తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: ఢిల్లీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక ప్రకటన రానుందా ?
ఇది కూడా చదవండి : Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook