Walnuts Benefits: శరీరానికి అత్యధిక మొత్తంలో పోషక పదార్ధాలు, విటమిన్స్, మినరల్స్ అందించేవి డ్రై ఫ్రూట్స్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. డ్రైఫ్రూట్స్‌లో ముఖ్యంగా వాల్‌నట్స్ లేదా అఖ్రోట్ పరగడుపున రోజూ తింటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
డ్రై ఫ్రూట్స్ అనేవి శరీరానికి చాలా అవసరం. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ కీలకంగా ఉపయోగపడుతాయి. ఎందుకంటే ఇందులో పుష్కలంగా ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం, జింక్, కాపర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ మనం తెలుసుకోవల్సింది వాల్‌నట్స్ గురించి. వాల్‌నట్స్ లేదా అఖ్రోట్‌లో ఇవన్నీ సమృద్ధిగా లభిస్తాయి. రోజూ వాల్‌నట్స్ తీసుకంటే మెదడు షార్ప్‌గా ఉంటుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపర్చడం, ఇమ్యూనిటీ పెంచడం వంటివి వాల్‌నట్స్ ఉపయోగాల్లో ముఖ్యమైనవి. అయితే ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా..రోజూ పరగడుపున తింటే ఎక్కువ లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియలో..
మలబద్ధకం సమస్య సాధారణమైపోయింది. మారుతున్న ఆహారపు అలవాట్లు దీనికి కారణం. ఈ పరిస్థితుల్లో రోజూ ఉదయం పూట..పరగడుపున వాల్‌నట్స్ తీసుకుంటే చాలా ప్రయోజనముంటుంది. దీనివల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ మెరుగైందో..మలబద్ధకం సమస్య పోతుంది. దాంతోపాటు ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ వేగవంతమవుతుంది.
రోగ నిరోధక శక్తి
మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే తప్పకుండా వాల్‌నట్స్ తీసుకోవాలి. రోజూ పరగడుపున తీసుకుంటే కచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతోపాటు రోగాల్ని ఎదుర్కొనే సామర్ధ్యం పెరుగుతుంది. ఎందుకంటే పరగడుపున తీసుకున్నప్పుడు..నేరుగా విటమిన్లు, మినరల్స్ తీసుకున్నట్టవుతుంది. ఇది శరీరానికి చాలా లాభదాయకం.
నిత్యం పోటీ ప్రపంచం కారణంగా ఒత్తిడి, ఆందోళన, వివిధ కారణాలతో వివిధ రకాల ఆలోచనలతో నిద్రకు దూరమౌతుంటాం. ఫలితంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రతిరోజూ వాల్‌నట్స్ తీసుకుంటే ఒత్తిడి, ఆందోళనను జయించవచ్చు. సుఖమైన నిద్ర పడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి