Hing Water: వేగంగా బరువు తగ్గాలనుకుంటే..ఆ నీళ్లొక్కటే పరిష్కారం, వెంటనే డైట్‌లో చేర్చుకోండి

Hing Water: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ప్రధాన సమస్య స్థూలకాయం. బరువు తగ్గించుకునే క్రమంలో చాలా పద్ధతులు అవలంభిస్తుంటాం. మరి వేగంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ నీళ్లే పరిష్కారంగా కన్పిస్తాయి. అవేంటో చూద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 3, 2022, 08:39 PM IST
  • రోజూ క్రమం తప్పకుండా ఇంగువ నీళ్లు తాగితే అద్భుత ప్రయోజనాలు
  • ఇంగువ నీళ్లతో స్థూలకాయం సమస్యకు పరిష్కారం
  • మైగ్రెయిన్ వంటి బాధపెట్టే నొప్పుల్ని దూరం చేయడంలో ఇంగువ పాత్ర కీలకం
 Hing Water: వేగంగా బరువు తగ్గాలనుకుంటే..ఆ నీళ్లొక్కటే పరిష్కారం, వెంటనే డైట్‌లో చేర్చుకోండి

Hing Water: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ప్రధాన సమస్య స్థూలకాయం. బరువు తగ్గించుకునే క్రమంలో చాలా పద్ధతులు అవలంభిస్తుంటాం. మరి వేగంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ నీళ్లే పరిష్కారంగా కన్పిస్తాయి. అవేంటో చూద్దాం..

స్థూలకాయం తగ్గించేందుకు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. కొన్ని ఫలితాల్నిస్తే..మరికొన్ని పద్ధతులు నిష్ప్రయోజనంగా మారుతుంటాయి. ఈ నేపధ్యంలో బరువు తగ్గేందుకు అద్భుతమైన చిట్కాను పాటిస్తే బరువు వేగంగా తగ్గుతారు. సర్వ సాధారణంగా ప్రతి వంటింట్లో కన్పించేదే అది. అదే హింగ్. తెలుగులో ఇంగువగా పిలుస్తాం. తమిళనాడులో చాలా విస్తృతంగా ఉపయోగిస్తారు ఇంగువను. దక్షిణాది ప్రజలు ఎక్కువగా సాంబారులో ఇంగువ వాడుతుంటారు. వంటలకు రుచి అందించేందుకు సాధారణంగా ఇంగువ వాడుతుంటారు. కానీ ఇంగువతో బరువు తగ్గుతారని చాలా తక్కువమందికి తెలుసు. 

బరువు తగ్గించేందుకు ఇంగువ చాలా దోహదపడుతుంది. అంతేకాకుండా మైగ్రెయిన్ సమస్య కూడా దూరమౌతుంది. బరువు తగ్గేందుకు ఇంగువ నీళ్లను తాగితే మంచి ఫలితాలుంటాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమౌతాయి. ఎందుకంటే ఇంగువ నీళ్లు..శరీరపు మెటబోలిజం ప్రక్రియను మెరుగుపరుస్తాయి. దీనికోసం ఇంగువను గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగాలి. 

శరీరపు మెటబోలిజంను మరింత పటిష్టం చేసేందుకు ఇంగువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఇంగువలో ప్రత్యేకంగా యాంటీ ఒబెసిటీ గుణాలుంటాయి. ఫలితంగా మీ శరీర బరువు వేగంగా తగ్గుతుంది. అంతేకాకుండా..ఇంగువనీళ్లు తాగితే..తలనొప్పి, మైగ్రెయిన్ పెయిన్ దూరమౌతాయి. అందుకే మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే..ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం వెంటనే ఇంగువను మీ డైట్‌లో చేర్చుకోండి. మరోవైపు మహిళల్లో పీరియడ్స్ సమయంలో తలెత్తే నొప్పుల్ని కూడా ఇంగువ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. 

Also read: Spinach Benefits: పాలకూర మగవారికి ఎంత ప్రయోజనకరమో తెలుసా..ఫిట్‌గా ఉంచుతుంది

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News