Home remedies for Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి సహజ సిద్ధంగా ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. చాలామందిలో ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. దీని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కలబందతో ఎఫెక్టివ్ హోమ్ రెమిడి ట్రై చేయండి స్ట్రెచ్ మార్క్స్ త్వరగా తగ్గిపోతాయి. కలబంద జెల్ లో ఎన్నో పోషకాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కణాల పునరుజ్జీవనానికి ఉపయోగపడుతుంది. అలోవెరా మాస్క్ వేసుకోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ తగ్గడమే కాకుండా ఆ చర్మంపై దురదలు, స్కిన్ సమస్యలు తగ్గించేస్తుంది. అలోవెరా లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల అభివృద్ధికి సహాయపడతాయి స్ట్రెచ్ మార్క్స్ ని త్వరగా తగ్గించేస్తాయి. అలోవెరా మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కలబంద, గ్లిజరిన్..
కలబంద ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ ఒక టేబుల్ స్పూన్ రెండిటిని బాగా కలుపుకొని మంచి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో నైట్ అంతా అప్లై చేసుకొని ఉదయం కడిగేసుకోవాలి. దీని రోజుకు రెండుసార్లు ప్రయత్నిస్తే ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
యోగార్టు, కలబంద మాస్క్..
ఒక టేబుల్ స్పూన్ యోగార్ట్ ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ కలబంద జెల్ తీసుకొని ఇది మాస్క్ లాగా తయారు చేసుకోవాలి. దీనిని కూడా స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికే కాదు.. ఇలా చేస్తే రేడియంట్ స్కిన్ మీసొంతం..
కలబంద, నిమ్మకాయ రసం..
ఇది కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేసే రెమెడీ స్ట్రెచ్ మార్క్స్ ని త్వరగా తగ్గిచేస్తుంది. నిమ్మకాయ కలబంద మాస్క్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని బాగా పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. స్ట్రెచ్ మార్క్స్ ప్రాంతంలో అప్లై చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి ఇది ప్రతిరోజు రెండుసార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
తేనె, అలోవెరా మాస్క్..
రెండు టేబుల్ స్పూన్ల, కలబంద జెల్ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మాస్క్ ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసి అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేయాలి.
ఇదీ చదవండి: జోజోబ ఆయిల్ మీ తలకు మసాజ్ చేస్తే 5 మిరాకిల్స్ జరుగుతాయి..
కలబంద, రోజు వాటర్..
రోజ్ వాటర్, కలబంద మిక్స్ చేసి కూడా ఎఫెక్టివ్ గా తయారు చేసుకోవచ్చు. రెండిటిని సమపాళ్లలో కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకొని అప్లై చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత ఆరిపోతుంది. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి ప్రతిరోజు రెండుసార్లు ట్రై చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి