How To Control Diabetes In 7 Days: ప్రస్తుతం మధుమేహం సాధారణ సమస్యగా మారింది. మధుమేహం సమస్యల బారిన ఒక్క సారి పడితే అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవల్స్‌ను కూడా అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. అయితే దీని కోసం ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారాలను తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ చిట్కాలను పాటించాలి:
ఎప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షిస్తూ ఉండండి:
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ప్రతి రోజు రక్తంలో చక్కెర పరిమాణాలను పరీక్షిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీలో ఏ ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ పరిమాణాలు పెరుగుతాయో తెలుసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం భోజనానికి ముందు చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ చక్కర పరిమాణాలు పెరగితే తప్పకుండా వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సమయానికి మందులు తీసుకోండి:
ఈ సమస్యలతో బాధపడేవారు సమయాని మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సకాలంలో మందులు తీసుకోనివారిలో షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వీరు మందులు వాడాలి.
వాకింగ్ చేయండి:
మధుమేహంతో బాధపడుతున్నవారు శారీరక శ్రమ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శరీరం యాక్టివ్‌గా కూడా మారుతుంది. కాబట్టి ప్రతి రోజూ 30 నిమిషాల పాటు నడవాలి. ఇలా చేయడం వల్ల బాడీ ఫిట్‌గా కూడా మారుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి:
మధుమేహంతో భాదపడుతున్నవారు తప్పకుండా భోజనంలో పోషకాలున్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్లే రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు తీసుకునే ఆహారంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook