/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Obesity Treatment: ప్రస్తుత బిజీ ప్రపంచంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. స్థూలకాయాన్ని సరైన సమయంలో గుర్తించగలిగితే చికిత్స కూడా సులభమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా వేళాపాళా లేని ఉద్యోగాలు, అంతకుమించి ఆహారపు అలవాట్లతో స్థూలకాయం ఓ సమస్యగా మారిపోతోంది. పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ప్రదాన కారణాలు. మరి స్థూలకాయానికి చికిత్స ఏంటి, ఎలా గుర్తించాలి. వ్యక్తుల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం వంటి అనేక కారణాలతో ఇప్పుడు ఇదొక జీవనశైలికి సంబంధించిన అంశంగా మారింది. అందరూ దీనిని కేవలం అధిక బరువుతోనే కొలుస్తుంటారు. అయితే ఇది అంతకు మించిన తీవ్రమైన పరిస్థితిగా పరిగణించి పూర్తి స్థాయి చికిత్స చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

స్థూలకాయంతో వచ్చే రోగాలు

హృద్రోగం, డయాబెటిస్, హై బ్లడ్‌ ప్రెషర్, కీళ్ల నొప్పులు.. ఇంకా అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాలతో  పాటు కొన్ని రకాల కేన్సర్‌లకూ  కారణమవుతుంది. కేవలం శారీరకమైనవే కాకుండా డిప్రెషన్, న్యూనతాభావం తదితర మానసిక సమస్యలకూ ఇది దోహదం చేస్తుంది. 

ఒబెసిటీని ఎలా గుర్తించాలి

ఒబెసిటీ విషయంలో వ్యక్తిగత బాధ్యతా రాహిత్యం, విల్‌పవర్‌ లోపించడం.. వంటివి కారణాలుగా చూపిస్తూ బాధితులపైనే పూర్తిగా నెపం వేస్తుంటారు. అలాగే కేవలం ఎక్కువ తినడం, వ్యాయామం లేకపోవడం వంటివి మాత్రమే ఒబెసిటీకి కారణం కావనేది అర్ధం చేసుకోవాలి. దీనికి జన్యుపరమైన సమస్యలతో పాటు పరిసరాలు, వాతావరణం, ప్రవర్తన..ఇవన్నీ కూడా కారణాల్లో ఉండొచ్చు.. ఒబెసిటీ కారణాల గురించి మనకు తక్కువ అవగాహన ఉంది. హార్మోనల్‌ కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా దీనిని సరైన రీతిలో అర్ధం చేసుకునే దశలోనే మనం ఉన్నాం. కాబట్టి త్వరపడి ఏదోఒక కారణాన్ని నిర్ధారించుకుంటే కానీ చికిత్స సాధ్యం కాదు.  

చికిత్స ఏది

ఒబెసిటీ బాధితులు కూడా తామేదో హార్మోనల్‌ సమస్య అని భావిస్తూ సరైన క్రమపద్ధతిలో కాకుండా త్వరితంగా సమస్య నుంచి బయటపడే మార్గాలు వెతుకుతుంటారు. అది సరైంది కాదు ఈ సమస్య నుంచి కోలుకోవడానికి జీవిత కాలపు ఆరోగ్య నిపుణుల అవసరం ఉంటుంది. వ్యక్తులకు సంబంధించిన డైట్‌ మాత్రమే కాకుండా తినే ఆహారం, అలాగే వ్యాయామాలను పరిశీలించాల్సి ఉంది. నెగిటివ్‌ కేలరీ బ్యాలెన్స్‌తో పాటు ఇదొక దీర్ఘకాలికం కొనసాగాల్సిన ప్రక్రియ, అంతే తప్ప శరవేగంగా ఫలితాలను ఆశించడం, వెంటనే బరువు తగ్గాలని కోరుకోవడం వల్ల ప్రయోజనం లేదు. 

తీవ్రతను బట్టి చికిత్స విధానం

వ్యక్తిగత ఒబెసిటీ తీవ్రతను ఆధారపడి చికిత్స ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య ప్రమాదాలు, మానసిక ప్రవర్తన శైలితో పాటు గతంలోని అధిక బరువు తగ్గించుకునే యత్నాలు వాటి ఫలితాలు కూడా దీనిలో పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత చికిత్సా పద్ధతులు అనుసరిస్తూ మల్టీ లెవల్‌ ఒబెసిటీ మేనేజ్‌మెంట్‌ నెట్‌వర్క్‌తో సమన్వయంతో పనిచేస్తే లక్ష్యం చేరుకోవడానికి  వీలవుతుంది. ఇందులో  భాగంగా రోగి జీవనశైలికి, ప్రాధామ్యాలకు నప్పేలా దీనిని డిజైన్‌ చేస్తారు. 

Also read: Heel pain: ఎన్ని హాస్పిటల్స్‌ తిరిగిన మడమ నొప్పులు తగ్గట్లేదా.. అయితే ఇలా చేయండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
How to detect obesity, follow these simple tips to check obesity and its treatment
News Source: 
Home Title: 

Obesity Treatment: స్థూలకాయాన్ని సకాలంలో గుర్తిస్తే నియంత్రణ సాధ్యమేనా, ఎలా గుర్తించ

Obesity Treatment: స్థూలకాయాన్ని సకాలంలో గుర్తిస్తే నియంత్రణ సాధ్యమేనా, ఎలా గుర్తించాలి
Caption: 
Obesity ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Obesity Treatment: స్థూలకాయాన్ని సకాలంలో గుర్తిస్తే నియంత్రణ సాధ్యమేనా, ఎలా గుర్తించ
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, July 9, 2022 - 22:40
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
42
Is Breaking News: 
No