Chicken Masala Fry Recipe: చికెన్ రిసిపీ అనగానే మనకు ఎన్నో రకాల రిసిపీలు గుర్తుకువస్తాయి. చికెన్‌తో ఏ రిసిపీ తయారు చేసుకున్నా అదిరిపోతుంది. ముఖ్యంగా ఆదివారం వచ్చినా.. ఇంటికి అతిథులు వచ్చినా ముందుగా మనం చికెన్ వండుతాం. దీంతో మనం నోరూరించే వంటకాలను ప్రయత్నించవచ్చు. ఈరోజు మనం ఘుమఘుమలాడే స్పైసీ చికెన్ మసాలా ఫ్రై ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
చికెన్ : 250 గ్రాములు
నూనె: 4TBSp
కరివేపాకు- కొద్దిగా
ఉల్లిపాయ:1
పచ్చిమిరపకాయలు:2
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2 TBSP
పసుపు: 1/2 స్పూన్
కారం: 1TBSp
ధనియాల పొడి: 1TBSP
గరంమసాలా: 1/2 TBSP
కొత్తిమీర- కట్ట
ఉప్పు: రుచికిసరపడా
తయారీ విధానం..
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం కడిగి పక్కన బెట్టుకోవాలి. ఓ కడాయి తీసుకుని అందులో నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోండి. ఈ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కడాయిలో చికెన్ వేసి వేయించుకోవాలి. ఓ 5 నిమిషాలపాటు వేయించుకోవాలి. అప్పుడు నీరంతా పోయి డ్రై అయిపోతుంది. చికెన్లో పసుపు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలిపాలి. మరో 5 నిమిషాలపాటు అలాగే వేయించుకోవాలి. ఆ తర్వాత కాసిన్ని నీళ్లు పోసుకుని మరో 10 నిమిషాలపాటు చికెన్ ఉడికించుకోవాలి. చివరగా ధనియాలు, గరం మసాలా పొడివేసుకుని కలుపుకోవాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీరా జల్లుకుంటే సరి వేడివేడిగా ఘుమఘుమలాడే చికెన్ మసాలా ఫ్రై రెడీ అయినట్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook