Koramenu Fry Recipe: మాంసాహారాలలో ఫిష్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫిష్‌లో ఎక్కువగా ఫ్యాట్ ఉండదు. ఇందులో విటమిట్ సి పుష్కలంగా
లభిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిచడంలో చేప ఎంతో మేలు చేస్తుంది. ఈ చేపలను రకరకాలుగా వండుకోవచ్చు. చేపలలో కొరమీను చేపకు ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఈ కొరమీను చేపతో రుచికరమైన ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. దీని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని పిల్లలకు తినిపించడం చాలా మంచిది. మీరు దీని అన్నంలో కలిపి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:
1 కిలో కొరమీను, 50 గ్రా॥ నూనె, 25 గ్రా॥ గసగసాలు, 20 గ్రా॥ ధనియాలు, 5 గ్రా॥ పసుపు, 5 గ్రా॥ కారం, 10 దాసినచెక్కలవంగాలు, 10 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి, 2 అల్లం ముక్కలు తగినంత ఉప్పు
తయారీ విధానం:
చేపను శుభ్రంచేసి తలా తోక తీసి అవతలపారేసి మధ్య భాగాన్ని పల్చటి గుండ్రటి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, ఒక ముద్దగా నూరాలి. గసగసాలూ వగైరా వేరే ముద్దగా
నూరుకోవాలి. చెక్కలవంగాలు మరో ముద్దగా నూరుకోవాలి. పొయ్యి మీద పెనంపెట్టి సగం నూనె పోసి కాగాక చేప ముక్కలు, అల్లం ముద్ద, పసుపు కలిపి ఆ నూనెలో వేయాలి. బాగా వేగాక గసగసాలూ, ధనియాలు, ముద్దవేసి నెమ్మదిగా వేపాలి. తర్వాత మిగిలిన నూనె కూడా పోసేసి రెండు వైపులా ఎర్రగా వేపాలి. వేగిన ముక్కలమీద కారం చల్లి తీసుకోవాలి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter