Millet Khichdi: బరువు తగ్గించడంలో మాస్టర్‌ రెసిపీ మన మిల్లెట్ ఖిచ్డీ !

Millet Khichdi Recipe: మిల్లెట్ ఖిచ్డీ  అనేది మిల్లెట్లు, మూంగ్‌ పప్పు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలతో తయారు చేసే మిశ్రమం. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ మిల్లెట్ ఖిచ్డీని  పెరుగు లేదా ఊరగాయతో తినవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2024, 09:35 PM IST
Millet Khichdi: బరువు తగ్గించడంలో మాస్టర్‌ రెసిపీ మన మిల్లెట్ ఖిచ్డీ !

Millet Khichdi Recipe: మిల్లెట్‌ ఖిచ్డీని తమిళంలో తినై అరిసి, తెలుగుతో కొర్క బియ్యం అని పిలుస్తారు. దీని మీరు కోడో మిల్లెట్‌ , బార్న్యార్డ్ మిల్లెట్ , చిన్న మిల్లెట్ వంటి ఇతర రకాల మిల్లెట్లను ఉపయోగించవచ్చు. రెట్, బెల్ పెప్పర్స్, గ్రీన్ బీన్స్, టమోటాలు, పచ్చి బఠానీలు వంటి కూరగాయలు ఇందులో బాగా సరిపోతాయి. కొన్నిసార్లు బచ్చలికూర లేదా మెంతి ఆకులను కూడా కలుపుతాను. మీరు దీన్ని స్టవ్ టాప్‌లో సాధారణ పాత్రలో లేదా ప్రెజర్ కుక్కర్‌లో లేదా ఇన్‌స్టంట్ పాట్‌లో చేయవచ్చు

మిల్లెట్‌ ఖిచ్డీ పదార్థాలు:

మొలకెత్తిన పెసర గింజలు- 1 కప్పు 
మొలకెత్తిన మినపప్పు - 1/2 కప్పు 
కొబ్బరి తురుము - 1/4 కప్పు 
జీలకర్ర  - 1/2 tsp
మిరియాలు  - 1/2 tsp
పసుపు  - 1/4 tsp
కరివేపాకు - కొన్ని
నూనె  - 2 tbsp
ఉప్పు - రుచికి తగినంత 

మిల్లెట్‌ ఖిచ్డీ చేసే విధానం:

మొదటగా పెసర గింజలు, మినపప్పులను 8-10 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన గింజలను పోషన కోల్పోకుండా కాటన్ లో చుట్టి మొలకెత్తించాలి.  బియ్యం పప్పులు కలిపి శుభ్రంగా కడగాలి. పాన్‌లో నూనె వేడి చేసి, జీలకర్ర, మిరియాలు వేసి చిటపటలాడించాలి. 
కరివేపాకు,  కొబ్బరి తురుము వేసి నూనెలో వేయించాలి. తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పిండిని వేసి కలపాలి. అవసరమైనంత నీరు ఉప్పు వేసి, కుక్‌టాప్‌తో మూసి ఉడికించాలి. చివరగా కొత్తమీరతు చల్లి సర్వ్ చేయాలి. 

చిట్కా:

మొలకెత్తిన గింజలను వాడటం వల్ల పోషణ విలువలు పెరుగుతాయి. 

ఈ విధంగా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు దీని ప్రతిరోజు డైట్‌లో భాగంగా తీసుకోవడం వల్ల మీరు సులువుగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా ఇందులోని విటమిన్‌, మినరల్స్‌ ఇతర పోషకాలు శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయి. అలాగే జీర్ణవ్యవస్థతో బాధపడేవారు దీని తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Also Read: Rooh Afza Recipe: వేడి వేసవికి చల్లని ఊరటని ఇచ్చే రూహ్ అఫ్జా షర్బత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News