How To Reduce Belly Fat In 7 Days: శరీరం బరువు పెరగడం వల్ల మొదట కొలెస్ట్రాల్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో గుండె పోటు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి శరీర బరువును తగ్గించుకుని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అయితే ఆధుని జీవన శైలి కారణంగా బరువు పెరిగే వారిలో బీపీ వంటి సమస్యలు కూడా వస్తున్నాయని ఇటివలే నివేదికలు పేర్కొన్నాయి. కాబట్టి శరీరంలోని పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్‌ను సకాలం తగ్గించుకోవడం చాలా మంచిది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుంటే సులభంగా బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టొచ్చు.
బరువు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే:
1. బరువును నియంత్రించుకునేందు, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాడనికి తప్పకుండా చియా విత్తనాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడమేకాకుండా సులభంగా అలసట కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు బరువును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. వీటిని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె జబ్బులు, ఆర్థరైటిస్ సమస్యలు సులభంగా తగ్గుతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ సహా ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
2. నానబెట్టిన వాల్‌నట్స్ శరీరానికి చాలా అవసరం. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఉదయం పూట అల్పాహారానికి ముందు తీసుకుంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
3. డార్క్ చాక్లెట్స్‌ను అందరూ తినడానికి ఇష్టపడతారు. అయితే వీటిని తినడం శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అధిక పరిమాణంలో తీసుకుంటే శరీరంలోని కొవ్వు వేగంగా తగ్గుతుంది. అంతేకాకుండా 190 కేలరీల శక్తి పెరుగుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : ఆ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత ముందుకు రాడు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook