Sleeping problems: మీకు నిద్ర పట్టడం లేదా...అయితే ఈ చిట్కాలు పాటించండి

Sleeping problems: ఈ ఉరుకుల పరుగులు జీవితంలో పడి మనిషి నిద్రపోవడం కూడా మరచిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే లేక ఉద్యోగ ఒత్తిడి వల్లే నిద్రలేమికి గురవుతున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2021, 06:29 PM IST
Sleeping problems:  మీకు నిద్ర పట్టడం లేదా...అయితే ఈ చిట్కాలు పాటించండి

Sleeping problems: అసలే ఉరుకుల పరుగులు జీవితం. ఈ బిజీ లైఫ్(Life)లో కూడా హాయిగా నిద్రపోవడం అనేది గొప్ప వరం. కానీ కరోనా(Corona) మన జీవితాలను చిన్నాభిన్నాం చేసింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇన్నింటి నడుమ సామాన్యుడి జీవితం భారమై..నిద్ర కరువైంది. ఈ నిద్రలేమి కారణంగా అనారోగ్యానికి గురవుతాం. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపించి...ఏ పని సరిగా చేయలేకపోతాం. అయితే ఈ చిట్కాలు పాటిస్తే..నిద్ర మీ సొంతమవుతుంది.

నిద్ర అనేది శారీరక అవసరం(need) అయినా.. దానికి మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే మీరు ఆనందంగా ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకోండి. దీంతో కాస్త ప్రశాంతత కలుగుతుంది. టెన్షన్ తో నిద్రపట్టకపోతే 15 నుంచి 20 సార్లు దీర్ఘంగా శ్వాస(breath) తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

Also Read: Health Benefits Of Milk: ప్రతిరోజూ పాలు ఆరోగ్యానికి మంచిదేనా, ఏ పాలు తాగడం శ్రేయస్కరం

నిజానికి మనం ఎక్కువగా ఆలోచించడం(thinking) వల్ల లేనిపోని టెన్షన్స్  మనమే క్రియేట్ చేసుకుంటాం. అందుకే అయిందేదో అయింది.. అంతా మనమంచికే.. జరిగేదేదో అది కూడా మన మంచికే అని అనుకోవడం ప్రారంభించండి. ఇలా అనుకోవడం వల్ల దిగులు తగ్గుతుంది. చాలా మంది ప్లానింగ్ లేకుండా పని చేస్తుంటారు. దీని వల్ల కూడా టెన్షన్(Tension) పెరిగి అది నిద్ర కరువు అవుతుంది. అందుకే మరుసటి రోజుకు సంబంధించి ఒక ప్లానింగ్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. దాంతో ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యవంతులు, సాధారణ వ్యక్తులైతే 10 నుంచి గరిష్టంగా 30 నిమిషాలు కునుకు తీయడం ఆరోగ్యానికి మేలు. గర్భంలో శిశువు ఉండే మాదిరిగా ముడుచుకుని పడుకోవాలి. అయితే ఎడమవైపు తిరిగి నిద్రిస్తే అధిక ప్రయోజనం ఉంటుందట. చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు గరిష్టంగా 90 నిమిషాలపాటు నిద్ర శ్రేయస్కరం. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. రాత్రి పూట ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాతే నిద్రపోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News