Most Searched Places: భారతీయులు ఇష్టపడుతున్న పర్యాటక ప్రదేశాలు..ఆశ్చర్యపరుచుతున్న గూగుల్‌ సెర్చింగ్ జాబితా!

Year Ender 2023 Most Searched Travel Places: చాలామంది భారతీయులు రాబోయే కొత్త సంవత్సరం సందర్భంగా పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు మన దేశంలో ఉన్న పర్యాటక పర్యాటక ప్రాంతాల కంటే.. ఇతర దేశాల్లో ఉన్న వాటిని ఎక్కువ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని గూగుల్ వెల్లడించింది. ఇటీవల గూగుల్ పర్యాటక ప్రదేశాల సెర్చింగ్ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఉన్న వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 10:57 PM IST
Most Searched Places: భారతీయులు ఇష్టపడుతున్న పర్యాటక ప్రదేశాలు..ఆశ్చర్యపరుచుతున్న గూగుల్‌ సెర్చింగ్ జాబితా!

Year Ender 2023 Most Searched Travel Places: కొత్త సంవత్సరం మరో ఆరు రోజుల్లో రాబోతోంది. అయితే చాలామంది యువత దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ట్రప్స్ ప్లాన్ చేసి ఉంటారు. దీంతో చాలామంది ఎక్కడికి వెళ్లాలి అని గూగుల్లో పర్యాటక ప్రదేశాలను సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సెర్చింగ్ జాబితాను ఇటీవలే గూగుల్ విడుదల చేసింది. చాలామంది గోవా, మాల్దీవ్స్ కి బదులు ఇతర ప్రదేశాలను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారని తెలిపింది. ఇంతకీ యువత ట్రిప్స్ కోసం గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసే పర్యాటక ప్రదేశాలు ఏమిటో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

గూగుల్ ఇటీవల విడుదల చేసిన సెర్చింగ్ లిస్టులో టాప్ త్రీ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే:

వియత్నాం:
2023 సంవత్సరంలోని చివరి నెలలో, న్యూ ఇయర్ లోని పర్యాటక ప్రదేశాలు సందర్శించాలనుకునేవారు మొదటగా వియత్నాం గురించి గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేశారట. వియత్నం లో సందర్శించాల్సిన ప్రదేశాలు ఏంటి? ఇక్కడి ప్రదేశాల ప్రాముఖ్యత ఏమిటి? ప్రయాణించడానికి వీసా తీసుకోవాల్సిన పద్ధతులు ఏంటి అని ఎక్కువగా సెర్చ్ చేశారని గూగుల్ వెల్లడించింది. దీంతోపాటు అక్కడే లభించే స్ట్రీట్ ఫుడ్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎక్కువగా సెర్చ్ చేశారని సమాచారం..

Also read: Winter Solstice 2023: ఇవాళే వింటర్ సోల్స్‌టిస్, ఏడాదిలో లాంగెస్ట్ నైట్, ఎందుకలా

ఇండోనేషియా, బాలి:
భారతీయులు అధికంగా సెర్చ్ చేసిన పర్యాటక ప్రదేశాల్లోని ఇండోనేషియా, బాలి రెండవ స్థానంలో ఉన్నాయి. ఇక్కడ లభించే వస్తువులు ఏంటి? ముఖ్యంగా చూడడానికి ఉండే ప్రదేశాలు ఏంటి అని అంశాలపై భారతీయులు ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఇండోనేషియా కు ప్రయాణం చేసేందుకు ఏయే రూల్స్ పాటించాలి?, ఏ పద్ధతుల్లో వీసాను తీసుకోవాలి? అనే ప్రశ్నలను కూడా సెర్చ్ చేశారు.

శ్రీలంక:
భారతదేశానికి పొరుగు దేశమైన శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను కూడా చాలామంది భారతీయులు చూసేందుకు ఆసక్తిగా చూపుతున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక దేశానికి ట్రిప్ కు వెళ్లడానికి చాలామంది భారతీయులు గూగుల్లో వివిధ ప్రశ్నలను సెర్చ్ చేశారు. ప్రస్తుతం గూగుల్ సెర్చింగ్ లో శ్రీలంక మూడవ స్థానంలో ఉంది. ఈ సెర్చింగ్ ద్వారా శ్రీలంక దేశంలో ఉన్న పురాతనమైన ప్రదేశాలు, నదుల అందాల గురించి ఎక్కువగా తెలుసుకున్నారు.

Also read: Phone Addiction: ఇలా చేస్తే చాలు…సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి మీరు, మీ పిల్లలు బయటపడవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News