Borugadda Arrest: వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో లెక్కలేనన్ని దందాలు, దౌర్జన్యాలకు పాల్పడడమేగాక నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లను నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మర్నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నాడు.
అయితే రెండు రోజుల కిందట గుంటూరుకు వచ్చినట్లు తెలియడంతో సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిపై భూ వివాదాలతో పాటు మహిళల వేధింపులపై పలు కేసులు ఉన్నాయి.
జగన్‌కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు, ప్రతిపక్షనేతలపై సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియా, టీవీ డిబేట్‌లలో ఇష్టానుసారం దూషణలు చేసేవాడు. జగన్ పేరు చెప్పి గుంటూరులో అనేక దందాలు, దౌర్జన్యాలు చేశాడు. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అసభ్యకర పదజాలంతో బెదిరింపులకు దిగేవాడు. ప్రతిపక్ష పార్టీల మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడేవాడని ఆరోపణలు ఉన్నాయి.
2021లో కర్లపూడి బాబు ప్రకాష్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. ఈ మేరకు ఆయన అదే ఏడాది జనవరి 25న అరండల్‌పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ వైసీపీ అధికారంలో ఉండటంతో అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేయడానికిప పోలీసులు సాహసించలేదు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. అంతేకాదు అతన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.
మరోవైపు తన భర్తను తనకు అప్పగించాలని ప్రభత్వాన్ని కోరుతూ వీడియో విడుదల చేశారు బోరుగడ్డ అనిల్ భార్య మౌనిక. ఇంట్లో ఉన్న తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తన భర్తకు ఎలాంటి నోటీస్ లేకుండా ఇంట్లోకి చొరబడి తాళాలు పగలగొట్టి తీసుకు వెళ్లారని ఆరోపించారు. తన భర్తను ఎక్కడికి తీసుకువెళ్లారో పోలీసులు ఆచూకీ చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు. తన భర్తకి ఏది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త బోరుగడ్డ అనిల్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లినా.. అక్కడ ఎవరు సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త కోసం న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి