Winter Solstice 2023: అనంత భూమిపై ఇండియా సహా చాలా దేశాలు భూమధ్యరేఖపై ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. ఆ ఆ దేశాలకు ఇవాళ అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. ఇవాళ్టి రోజుకు కేలండర్‌లో ప్రత్యేకత ఉంది. ఏడాదిలో షార్టెస్ట్ డే, లాంగెస్ట్ నైట్ ఇవాళే డిసెంబర్ 21.
ఖగోళంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు 24 గంటలు, సూర్యుని చుట్టూ తిరిగేందుకు 364 రోజులు పడుతుంది. ఈ క్రమంలోనే పగలు రాత్రి ఏర్పడుతుంటాయి.ఇవాళ ఏడాదిలో అత్యంత పొడుగైన రాత్రి లేదా అత్యంత చిన్న పగలుగా అంటే వింటర్ సోల్స్‌టిస్‌గా పరిగణిస్తారు. ఇదొక ఖగోళ ప్రక్రియ. అధికారికంగా చలికాలం ప్రారంభానికి సంకేతమనుకోవచ్చు. వింటర్ సోల్స్‌టిస్ అంటే భూమి ఉత్తర ధృవం సూర్యుడికి బాగా దూరంగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. దీనివల్ల పగలు చిన్నదిగా రాత్రి పెద్దదిగా ఉంటుంది. ప్రతియేటా డిసెంబర్ 21న వింటర్ సోల్స్‌టిస్ సంభవిస్తుంది.
భూమి 23.5 డిగ్రీల అక్షాంశంలో ఉన్నప్పుుడు ఈ ఖగోళ ప్రక్రియ సంభవిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ పరిణాం ఏడాదిలో వేర్వేలు సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుంది. వింటర్ సోల్స్‌టిస్ సమయంలో భూమి ఉత్తర ధృవం సూర్యుడికి దూరంగా ఉంటుంది. దాంతో ఇది సంభవిస్తుంది. ఇవాళ ఉత్తర ధృవంలో దాదాపు 7.14 గంటలే వెలుతురు కన్పిస్తుంది. శీతాకాలంలో తక్కువ పగటి సమయం, ఎక్కువ రాత్రి సమయాన్ని ఇది సూచిస్తుంది. వింటర్ సోల్స్‌టిస్ అనేది శీతాకాలంలో కీలకమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ్టి నుంచి నెమ్మది నెమ్మదిగా పగటి సమయం పెరుగుతుంటుంది.
Also read: Underarm Whitening: బియ్యం పిండి ఉపయోగించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook