Hair Growth Tips: జుట్టు రాలడం ఆగడం లేదా.. అయితే ఈ రసాలు తాగండి చాలు..

Juices For Hair Growth In 10 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది సీజన్‌ మారుతున్న క్రమంలో జుట్టు రాలడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ రకాలా ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2022, 01:03 PM IST
  • తరుచుగా జుట్టు రాలుతుందా..
  • ప్రతి రోజు క్యారెట్‌ జ్యూస్‌ తాగండి
  • ఇలా తాగితే అన్ని సమస్యలు దూరమవుతాయి.
 Hair Growth Tips: జుట్టు రాలడం ఆగడం లేదా.. అయితే ఈ రసాలు తాగండి చాలు..

Juices For Hair Growth In 10 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది సీజన్‌ మారుతున్న క్రమంలో జుట్టు రాలడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ రకాలా ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. జుట్టు రాలడం సమస్యలు తగ్గకపోతే తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి  ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఈ రసాలను తీసుకోండి:
 క్యారెట్ జ్యూస్:

క్యారెట్ జ్యూస్ జుట్టుకు చాలా మంచిది. ఇందులో విటమిన్ ఎ, ఇ  అధిక పరిమాణంలో ఉండడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

కివీ జ్యూస్:
కివీల్లో అధిక పరిమాణంలో విటమిన్ ఇ లభిస్తుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్యను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఊడిపోయిన జుట్టును కూడా తిరిగి తెప్పించేందుకు సహాయపడుతుంది.

కలబంద రసం:
కలబంద రసం జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో జుట్టుకు బలంగా చేసే విటమిన్లు ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. అంతేకాకుండా చుండ్రు, దురద సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News