కర్వా చౌత్ సంబరాల్లో బాలీవుడ్ సినీ తారలు

Last Updated : Oct 10, 2017, 04:47 PM IST
కర్వా చౌత్ సంబరాల్లో బాలీవుడ్ సినీ తారలు

కర్వా చౌత్ పర్వదినాన్ని బాలీవుడ్ ప్రముఖులు సందడిగా జరుపుకున్నారు. ఉత్తర భారతదేశంలో హిందువులు జరుపుకొనే సాంప్రదాయ ఉత్సవం కర్వా చౌత్. భర్తలు బాగుండాలని వారి క్షేమం కోసం భార్యలు సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రుడికి పూజలు చేసి, చంద్రోదయం తర్వాత జల్లెడ చాటున భర్తను చూస్తారు. ఇలా చేస్తే భర్త ఆయురారోగ్యాలతో ఉంటారని భార్య నమ్మకం. భర్తను చూసిన తరువాత ఉపవాసం విరమిస్తారు. 

కర్వా చౌత్ వేడుకలకు సంబంధించిన సన్నివేశాలు బాలీవూడ్ చిత్రాలలో తరచూ కనిపిస్తూ ఉంటాయి. భార్యా భర్తల ప్రేమకు ప్రతీకగా ఈ పర్వదినం జరుపుకుంటారు.  కభీ ఖుషి కభీ గం, దిల్వాలే దుల్హనియా లే జాయింగే, బివి నెంబర్ 1 తదితర చిత్రాల్లో సన్నివేశాలు ఇందుకు నిదర్శనం. కర్వా చౌత్ పర్వదినానికి సంబంధించి ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లలో బాలీవూడ్ సినీతారలు ఫోటోలు పోస్టు చేశారు.

 

 

 

Starving,Thirsty , yet in great spirits,That’s what friends are for ❤️❤️❤️❤️

A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on

 

Trending News