Mahashivratri Recipe: మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 18న వస్తోంది. దీంతో భక్తులంతా భక్తి శ్రద్ధలతో శివుడికి ఉపవాసాలు పాటించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఈ క్రమంలో జామ పండ్లతో తయారు చేసిన నైవేద్యాన్ని శివుడి సమర్పించడం ఆనవాయితిగా వస్తోంది. ఉపవాస సమయంలో ఇలాంటి జామ రెసిపీని తీసుకోవడం వల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా జామలో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి ఈ జామ పండ్లతో తయారు చేసిన తాండై ఈ క్రమంలో తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జామ తాండాయి ఎంత రుచిగా ఉంటుందో.. దానిని తయారు చేయడం కూడా అంతే సులభం. మీరు దీన్ని తయారు చేయడానికి డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటి వరకు జామ తాండాయిని తయారు చేయకపోతే.. మేము చెబుతున్న విధంగా ట్రై చేస్తే చక్కని రుచితో పొందవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జామ తాండై రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
1 గ్లాస్ పాలు
1/2 గ్లాస్ జామ రసం
1/2 కప్పు బాదం
1/4 కప్పు జీడిపప్పు, పిస్తా
1/4 కప్పు పుచ్చకాయ గింజలు
2 స్పూన్ యాలకుల పొడి
1 టీస్పూన్ సోంపు
ఫుడ్ కలర్
5-6 ఐస్ క్యూబ్స్
జామ తాండై రెసిపీని తయారు చేసే విధానం:
జామతాండైని తయారు చేయడానికి.. ముందుగా జామ రసం తీసుకోండి. తర్వాత మీడియం మంట మీద పాన్ వేడి చేసి..అందులో బాదంపప్పును వేయించాలి. బాదంపప్పులు వేయించి.. అదే పాన్‌లో అదేవిధంగా జీడిపప్పు, పిస్తాలను కొద్దికొద్దిగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పెనంలో అన్ని వేసి మళ్లీ లైట్‌గా వేయించి వాటిని మిక్సీలో వేసి గ్రైడ్ చేసేకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని పైన యాలకుల పొడి వేసి చెంచా సహాయంతో కలపాలి. అందులోనే అర గ్లాసు పాలు, అర గ్లాసు జామ రసాన్ని కలపండి. ఇలా కలిపిన దానిలో ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుంటే.. శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Bandla Ganesh Tweets: మీరు వండర్ ఫుల్, మీరే ఇండియా ఫ్యూచర్ కేసీఆర్.. బండ్లన్న ట్వీట్ల వర్షం!
Also Read: Hero Nani Clarity: నాని నోట బూతు పదం.. అసలు సంబంధమే లేదంటున్నాడే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook