Monsoon Drinks For Reduce Health Problems: మధ్య వయసులో ఉన్న చాలా మంది తరుచగా వేసవి, వర్షాకాలాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారు. ముఖ్యంగా చాలా మంది ఈ రెండు సీజన్స్‌లో జ్వరంతో పాటు తలనొప్పి, బాడీ పెయిన్, స్టొమక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా రసాయనాలతో కూడిన ఔషధాలు వినియోగిస్తారు. వీటిని వినియోగించడం సరికాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా కొన్ని పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లను తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎలాంటి జ్యూస్‌లను తాగాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ జ్యూస్‌లు తాగితే ఇన్ఫెక్షన్లు దరిచేరవు:
నిమ్మకాయ రసం:
ఈ రసం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగగిస్తుంది. అయితే ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత అరకప్పు నారింజ రసం, 150 ఎమ్‌ఎల్ సోడా కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులోనే రుచికి సరిపడ చక్కెర వేసుకుని షేక్ చేసుకుని తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.
స్ట్రాబెర్రీల జ్యూస్:
పొట్ట ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు స్ట్రాబెర్రీల జ్యూస్ కూడా చాలా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రసాన్ని తయారు చేయడానికి ముందుగా స్ట్రాబెర్రీలు తీసుకుని కట్ చేసి జ్యూస్‌లా తయారు చేసుకుని గ్లాస్‌లో పోసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో పుదీనా ఆకులు వేసి ఒక చెంచా చక్కెర వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని ప్రతి రోజు వానా కాలంలో తాగితే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలపుతున్నారు.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
ఆరెంజ్, స్ట్రాబెర్రీ జ్యూస్:
ఈ రెండింటితో తయారు చేసిన జ్యూస్ కూడా చాలా ప్రభావంతంగా శరీరానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు బాడీకి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ జ్యూస్‌ను తయారు చేయడానికి ముందుగా ఆరెంజ్ రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఒక గ్లాస్‌లో పోసుకుని అందులో స్ట్రాబెర్రీని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని తాగితే వర్షం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఆరెంజ్ జ్యూస్:
తాజా బత్తాయి పండ్లతో తయారు చేసిన రసం కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముందుగా ఆరెంజ్ జ్యూస్ తయారు చేయడానికి 4 ఆరెంజ్ పండ్లను తీసుకుని వాటీ గుజ్జు నుంచి రసాన్ని తీయాలి. ఆ తర్వాత ఈ రసాన్ని గ్లాస్‌లో పోసుకుని చిన్న చిన్న స్ట్రాబెర్రీ ముక్కలను వేసుకుని తాగితే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి