Onion Juice For Hair: ఇక నుంచి హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అవసరం లేదు.. ఈ రసంతో బట్టతలకు చెక్‌..

Use Of Onion Juice For Hair: ఉల్లిపాయ రసం ప్రతి రోజూ జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 11:32 AM IST
Onion Juice For Hair: ఇక నుంచి  హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అవసరం లేదు.. ఈ రసంతో బట్టతలకు చెక్‌..

Use Of Onion Juice For Hair:  ఉల్లిపాయ రసం బట్టతలని నయం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..20 రోజుల పాటు ఎర్ర ఉల్లిపాయ రసాన్ని వినియోగిడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది నిపుణులు ఈ చిట్కా గురించి సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం బట్ట తల సమస్యలతో బాధపడుతున్నవారు మార్కెట్ లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలతో పాటు దీర్ఘకాలీక సమస్యలు కూడా వస్తున్నాయి. ఎర్ర ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల దీనిని వినియోగించడం వల్ల మంచి గ్రోత్‌ చూడవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బట్టతల అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి ముందుగా బట్టతలకి కారణం ఏమిటి అనే దాని గురించి సమాచారాన్ని తీసుకోండి. కొందరిలో జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల కారణాల వల్ల కూడా జుట్టు రాలుతుంది. అంతేకాకుండా కొందరిలో అలోపేసియా అరేటా కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. కాట్రిషియల్ అలోపేసియాలో కూడా జుట్టు మూలాలు నాశనం చేస్తుంది. దీని కారణంగా జుట్టు రావడం ఆగిపోతుంది. మళ్లీ పెరగడం సమస్యగా మారుతుంది.

ఉల్లిపాయ రసం ఎలా ఉపయోగించాలి:
జుట్టు ఎలా రాలిపోతుందో తెలియకుండా ఉల్లి రసాన్ని పూయడం సరికాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఉల్లిపాయలలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. కాబట్టి సల్ఫర్, ప్రోటీన్లు జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా బట్టతల సమస్యలతో బాధపడేవారికి సల్ఫర్ జుట్టు మూలాలకు చేరి.. కొత్త వెంట్రుకలు రావడానికి సహాయపడుతుంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్‌ల ప్రభావం:
ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ ప్రతి జుట్టు సమస్యకు ప్రభావవంతంగా పని చేస్తుంది. తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్, చుండ్రు లేదా చర్మశోథ సమస్యలతో బాధపడేవారికి  జుట్టు కణాలు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు దెబ్బతిన్న కణాలను కూడా రిపేర్‌ చేయడానికి సహాయపడతాయి. కాబట్టి ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read:  Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండ

Trending News