Peanut For Weight: వేరుశెనగలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉన్నాయి. కాబట్టి వేరుశెనగను కొందరు బెస్ట్ ఫుడ్‌గా చెబుతారు. వీటిల్లో బాదంలో లభించే పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని చిన్న బాదం పప్పులు అని అంటారు. వేరుశెనగలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, కొవ్వు ఆమ్లాల లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి ఈ పల్లిలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అయితే వీటిని తీసుకోడం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సమస్యలు వస్తాయి:
థైరాయిడ్‌కు హానికరం:
హైపోథైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు అస్సలు ఈ వేరుశెనగలను తీసుకోవద్దు. వేరుశెనగ తినడం వల్ల TSH (థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్) స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఇది ప్రాణాంతక సమస్యగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
కాలేయ సమస్యలు:
ఇప్పటికే కాలేయ సమస్య ఉన్నట్లయితే.. వేరుశెనగలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. వేరుశెనగలో ఉండే మూలకాలు కాలేయానికి హాని చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీసే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.
అలర్జీ:
కొందరిలో వేరుశెనగలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అలర్జీ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
బరువు పెరుగుతుంది:
వేరుశెనగలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలున్నాయి. దీంతో బరువు కూడా పెరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో వీటిని తీసుకోకపోవడం చాలా మేలని నిపుణులు సూచిస్తున్నారు.
వేరుశెనగల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు:
వేరుశెనగ తినడం గుండెకు మేలు చేస్తుంది.
బరువు పెరగాలనుకునేవారు సులభంగా బరువు పెరుగుతారు.
మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
శరీర మంటలను తగ్గిస్తుంది.
ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రింస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook