Premature White Hair Problem Solution: ప్రస్తుతం చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చిన్న వయస్సు వారు కూడా వృద్ధులుగా కనిపిస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే కెమికల్ హెయిర్ కలర్లను వినియోగిస్తున్నారు. ఇలాంటి రసాయనాలతో కూడిన హెయిర్ కలర్స్‌ను వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఆయుర్వేద మూలికలతో కూడిన హెయిర్ డైను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని ఉపయోగించడం వల్ల హెయిర్ బ్లాక్ కలర్లోకి మారడమేకాకుండా బ్రౌన్ కలర్లో కూడా మీరు జుట్టును పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మీరు తెల్ల జుట్టు నుంచి కేవలం 2 గంటల్లో ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన హెయిర్ డైతో ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం మీరు రతన్జోత్, జటామాంసి, బిభితాకి, మెహందీలను ఉపయోగించి జుట్టును అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. ఇందులో ఉండే ఔషధ మూలికలు జుట్టు రంగును మార్చేందుకు సహాయపడుతుంది.
ఈ మూలికలు జుట్టు రంగును దృఢంగా ఉంచడమేకాకుండా వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది. అయితే ఆ మూలికలన్నింటినీ పొడిలా చేసుకుని హెన్నాతో కలిపి జుట్టుకు అప్లై చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడమేకాకుండా నారింజ రంగులోకి కూడా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రతన్జోత్, జటామాంసి, బిభితాకి, మెహందీలను నూనెలో మరిగించి ప్రతి రోజూ జుట్టు అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు సమస్యలన్ని సులభంగా తగ్గుతాయి.
ఇంట్లోనే తెల్ల జుట్టుకు సహజ రంగు వేసుకోవడం ఎలా?
రతన్జోత్, జటామాంసి, బిభితాకి, మెహందీలను నీటిలో నానబెట్టి మిశ్రంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇలా చేసిన మిశ్రమాన్ని జుట్టు అప్లై చేస్తే 2 గంటల్లో మీ తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మారుతుంది. పూర్వీకులు తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇదే చిట్కాను వినియోగించేవారని నిపుణులు చెబుతున్నారు. అయితే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: Bandi Sanjay: నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. టూంబ్స్ కూల్చేస్తాం..
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 18 నెలల పెండింగ్ డీఏపై త్వరలో ప్రకటన..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి