How To Prevent Rice Weevils: బియ్యంలో నల్లని పురుగులు తయారవుతున్నాయా.. ఈ రెండు చిట్కాలతో ఇలా సులభంగా చెక్ పెట్టండి

How To Prevent Rice Weevils: ప్రస్తుతం చాలామంది బియ్యాన్ని విలువ చేసిన రెండు నెలల తర్వాత బియ్యం లో నల్లని పురుగులు తయారవుతున్నాయి. అంతే కాకుండా వీటి లార్వా కారణంగా పొట్ట సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ పురుగులు బియ్యంలో  తయారు కాకుండా పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 17, 2023, 08:32 PM IST
How To Prevent Rice Weevils: బియ్యంలో నల్లని పురుగులు తయారవుతున్నాయా.. ఈ రెండు చిట్కాలతో ఇలా సులభంగా చెక్ పెట్టండి

How To Prevent Rice Weevils: పల్లె ప్రాంతాల్లో ఉండే ప్రజలు బియ్యాన్ని ఎక్కువ రోజులు పాటు నిల్వ చేసుకొని వినియోగిస్తూ ఉంటారు. బియ్యమే కాకుండా పప్పు దినుసులు, చిరుధాన్యాలను కూడా ఎక్కువ రోజులపాటు నిల్వ చేస్తూ వినియోగిస్తారు. అయితే నిల్వ చేసిన తర్వాత బియ్యంలో చిన్న చిన్న పురుగులు తయారవ్వడం మీరు గమనించవచ్చు. ఇలా పురుగులు వచ్చిన తర్వాత బియ్యం నూసిగా మారుతుంది. అయితే చాలామంది ఇలాంటి బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు.

ఇలా తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అంతేకాకుండా చాలామంది గంటల తరబడి బియ్యం నుంచి పురుగులను వేరు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎక్కడో ఒకచోట పురుగులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ పురుగులు పట్టకుండా ఉండడానికి చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

ప్రస్తుతం బియ్యం నుంచి పురుగులను తొలగించేందుకు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన పౌడర్లను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించిన బియ్యాన్ని తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా సాధారణంగా ఇంట్లో లభించే కొన్ని వస్తువులను వినియోగించడం వల్ల బియ్యం పురుగులు పట్టకుండా ఉంటాయి.

బియ్యాన్ని డబ్బాలలో నిల్వ చేసే క్రమంలో తప్పకుండా వాటిపైన వేప ఆకులను వేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పురుగులు తయారు కాకుండా ఉంటాయి. అంతేకాకుండా బియ్యం విలువ చేసే డబ్బాల్లో లవంగాలు ఉంచడం వల్ల కూడా పురుగులు పట్టవట. కాబట్టి మీరు బియ్యాన్ని భద్రపరిచే చోట తప్పకుండా లవంగాల డబ్బాను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా బియ్యం డబ్బాలో అగ్గిపెట్టెను తెరిచి ఉంచడం వల్ల కూడా పురుగులు పట్టవు.

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News