Right Fabric To Wear In Monsoon: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాకాలం మొదలైంది. అయితే వానా కాలంలో ఆనదం పొందడానికి చాలా మంది వర్షంలో తడుస్తూ ఉంటారు. ఇదే క్రమంలో బట్టలు నాని చర్మంపై వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొంతమంది నిపుణులు పలు సూచనలు చేశారు. వానా కాలంలో సరైన బట్టల వేసుకుని తడవడం వల్ల ఈ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి వర్షాకాలంలో దుస్తులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో పొడిగా ఉండే దుస్తులను వేసుకుంటే.. ఫంగస్, బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ధరించడం వల్ల మీ చుట్టూ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.. అదే విధంగా స్టైలిష్‌గా కూడా కనిపించవచ్చ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వర్షాకాలంలో పొడి బట్టలతో పాటు.. ఫ్యాషన్ బట్టలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో ఈ దుస్తువులను ధరించండి:
కాటన్ బట్టలు:
వర్షాకాలంలో కాటన్ బట్టలను ధరించడం మంచిది. ఇవి చర్మానికి గాలి తగిలేటట్లు ఉంచుతాయి. వర్షంలో నానినప్పుడు తొందరగా పొడిగా అవుతాయి.
క్రేప్ ఫాబ్రిక్:
వర్షాకాలంలో అవుట్డోర్ యాక్టివిటీ కోసం ప్లాన్ చేసే వారు.. మీరు తప్పకుండా క్రేప్ ఫాబ్రిక్ దుస్తులను ధరించవచ్చు. ఇది తడిసిన వెంటనే ఆరిపోతుంది. కావును వానా కాలంలో క్రేప్ ఫాబ్రిక్ దుస్తువులను ధరించడం చాలా మేలు.
చాంబ్రే ఫాబ్రిక్:
వర్షాకాలంలో చాంబ్రే ఫాబ్రిక్ ఉత్తమైనది నిపుణులు తెలుపుతున్నారు. ఇది చర్మంపై తేలికగా ఉంటుంది. కావున శరీరానికి వేడిని అందిస్తుంది.
నైలాన్ దుస్తులు:
వర్షాకాలంలో నైలాన్ బట్టలు వేసుకుంటే.. ఇవి వాన తడిసిన తర్వాత కూడా ఎక్కువసేపు తడిగా ఉండవు. అంతేకాకుండా నైలాన్ దుస్తులు వర్షంలో తడిగా ఉన్నప్పుడు కూడా శరీరానికి మంచి వేడిని అందిస్తాయి.
పాలిస్టర్ బట్టలు:
వానాకాలంలో ఫ్యాషనబుల్‌గా కనిపించాలంటే.. పాలిస్టర్ బట్టలను వేసుకోవడం మంచిది. పాలిస్టర్ ఫాబ్రిక్‌తో తయారు చేసిన క్రాప్ టాప్, స్కర్ట్, దుస్తులను ధరించవచ్చు. వర్షాకాలంలో ఇవి తేలికగా ఎండిపోతాయి.
Also Read: Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో ఇలా చేయకండి.. ఈ విధంగా చేస్తే సమస్యలు తప్పవు..!
Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్డేట్స్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook