Shiny Hair At Home Remedies: జుట్టు పొడుగ్గా అందంగా పెరగడమే కాదు స్మూత్ సిల్కీగా మెరుస్తూ ఉండాలని అందరూ అనుకుంటారు. దీనికి రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఇవి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి అయితే ఇంట్లోని కొన్ని వస్తువులతో సులభంగా మన జుట్టు మెరిసేలా కాంతివంతంగా చేసుకోవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.
కలబంద జెల్..
మీ జుట్టు కాంతివంతంగా మృదువుగా మెరవాలంటే కలబంద ఒక ఎఫెక్టివ్ రెమిడి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాదు సౌందర్యపరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కలబంద జెల్ తీసుకొని అందులో వాటర్ కలిపి జుట్టు అంతా స్ప్రే చేసుకోవాలి ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేసుకున్నారంటే సిల్కీ హెయిర్ ఇంట్లోనే ఈజీగా పొందుతారు
ఆపిల్ సైడర్ వెనిగర్..
ఆపిల్ సైడర్ వెనిగర్ తో కూడా సిల్కీ హెయిర్ మీ సొంతం. ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఒక కప్పు చల్లటి నీటిలో కలిపి ఇది షాంపూ చేసిన తర్వాత కండిషనర్ మాదిరి ఈ సొల్యూషన్ ను ఉపయోగించాలి ఓ 15 నిమిషాలు అలాగే ఉంచి మళ్ళీ హెయిర్ వాష్ చేసుకోవాలి.
బనానా హెయిర్ మాస్క్..
బనానా జుట్టుకు ఒక వరం వంటిది ఇది మీ జుట్టుకు సహజ సిద్ధంగా మెరుపును అందిస్తుంది. మృదువుగా మార్చి ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అరటిపండును నేచురల్ ఆయిల్స్ ఉంటాయి బనానా ముక్కలో రెండు చుక్కల లావెండర్ ఆయిల్ వేసి పేస్ట్ మాదిరి తయారు చేసుకొని ఓ అరగంట పాటు జుట్టుకు అప్లై చేసి ఆ తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇది షాంపూ చేసిన తర్వాత ఉపయోగిస్తే మరీ మంచిది.
ఇదీ చదవండి: నల్లాలు తుప్పు పట్టి నీటి మరకలు పేరుకున్నాయా? ఈ రెమిడీతో కొత్తవాటిలా మెరిసిపోతాయి..
కాఫీ..
కాఫీ జుట్టుకు మాయిశ్చర్ అందిస్తుంది. ఇది కూడా సహజసిద్ధమైన మెరుపుని అందిస్తుంది. ఇది జుట్టు కుదుళ్ల నుంచి ట్రెస్సెస్ ను ఆరోగ్యంగా చేస్తుంది. కాఫీని నీళ్లలో కలిపి స్ప్రే లో బాటిల్ లో వేసుకొని జుట్టుకు స్ప్రే చేసుకుని ఓ 15 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఎగ్ వైట్..
ఎగ్ వైట్ తో కూడా చుట్టూ షైనీగా మెరుస్తూ కనిపిస్తుంది. గుడ్డును పగలగొట్టి అందులో పచ్చసొన పక్కకు తీసి ఈ తెల్ల బాగానే మాత్రమే జట్టంతటినీ అప్లై చేసి ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత సాధారణ షాంపు ఉపయోగించి తలస్నానం చేయాలి ఇది వారానికి ఒకసారి ట్రై చేస్తే మీ జుట్టు సహజంగా మెరుపును సంతరించుకుంటుంది
షియా బట్టర్..
షియా బట్టర్ కూడా మీ చుట్టూ ఆరోగ్యవంతంగా మెరిసిపోతుంది ఇది జుట్టుకు సహజసిద్ధంగా మాయిశ్చర్ అందిస్తుంది ఆరోగ్యంగా పెంచుతుంది ఎసెన్షియల్ ఆయిల్ కలిపి జుట్టుకు షియా బట్టర్ అప్లై చేసి షాంపుతో తలస్నానం చేసుకోవాలి
ఇదీ చదవండి: ఈ సహజ సిద్ధమైన ఫుట్ స్క్రబ్స్‌తో మీ పాదాలు మృదువుగా మారిపోతాయి..
రోజ్మెరీ..
ఈ ఆయిల్ కూడా జుట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ డైరెక్టుగా ఈ ఆయిల్లో చుట్టుకు ఉపయోగించవచ్చు జుట్టుకు అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేసిన సరిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి