Skin Care After 30: 45 ఏళ్ల తర్వాత కూడా చర్మం అందంగా, ముడతలు లేకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

Skin Care After 30: 30 ఏళ్ల తర్వాత చర్మంపై సమస్యలు సర్వసాధరణమే..కాబట్టి చర్మ సమస్యలు రాకుండా పలు రకాల చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల చర్మంపై అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం ఎలాంటి చిట్కాలను వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2022, 03:13 PM IST
  • 45 ఏళ్ల తర్వాత కూడా చర్మం అందంగా,
  • ముడతలు లేకుండా ఉండాలంటే..
  • సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.
Skin Care After 30: 45 ఏళ్ల తర్వాత కూడా చర్మం అందంగా, ముడతలు లేకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

Skin Care After 30: 30 ఏళ్ల తర్వాత చర్మంపై కాంతి తగ్గిపోతోంది. దీని కారణంగా ముఖం అందహీనంగా తయారవుతుంది. . అందుకే ఈ వయసు తర్వాత చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  30 ఏళ్ల తర్వాత చర్మంలో లూజ్‌నెస్ ఏర్పడుతుంది. దీని వల్ల చర్మంపై ముడతలు ఏర్పడి చర్మంపై తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి 30 నుంచి 35 సంవత్సరాలైనా చర్యాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం...

30 ఏళ్ల వయసులో చర్మాన్ని ఇలా సంరక్షించుకోవాలి:
మాయిశ్చరైజర్ వాడడం:

30 ఏళ్ల తర్వాత చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడం చాలా ముఖ్యం. మాయిశ్చరైజర్ చర్మానికి పోషణనిచ్చి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.  చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని ప్రభావవం తేమపై కూడా పడుతుంది.

టోనర్:
చర్మంపై టోనర్ ఉపయోగించడం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. టోనర్‌ను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల  చర్మం లోపల ఉండే మురికిని శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా చర్మం యొక్క pH స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చర్మం మెరిసేలా తయారవుతుంది.

సీరం:
చర్మానికి సీరమ్ అప్లై చేయడం వల్ల చర్మ కణాలు మెరుగుపడుతాయి. కాబట్టి రాత్రి పూట సీరమ్‌ను ఉపయోగించడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సీరమ్ చర్మానికి పోషణనిచ్చి శుభ్రంగా ఉంచుతుంది.

సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి:
ముఖ సంరక్షణ కోసం సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సన్‌స్క్రీన్ ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

 

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు దయచేసి నిపుణులను సంప్రదించండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.

Also Read : MLC Kavitha: లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టులు.. ఢిల్లీలో కవిత! ఏం జరగబోతోంది?

Also Read : Impact Player: క్రికెట్‌ చరిత్రలో మొదటిసారి.. తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి హృతిక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News