Skin Care Tips: అంతర్గత ఆరోగ్యమే కాదు బాహ్య ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన శైలి, కాలుష్యం కారణంగా బాహ్య ఆరోగ్యంపై తరచూ ప్రతికూల ప్రభావం పడుతూ ఉంటుంది. ఫలితంగా అందం దెబ్బతింటుంది. ముఖ్యంగా ముఖంపై ముడతలు కొట్టొచ్చినట్టు కన్పిస్తూ వృద్ధాప్యం ముందే ఆవహిస్తుంది.
అందాన్ని పరిరక్షించుకోవడం చాలా క్లిష్టమైందే అయినా కొన్ని సులభమైన పద్ధతులు పాటిస్తే ముఖ సౌందర్యం చెక్కుచెదరకుండా ఉంచుకోవచ్చు. వివిధ రకాల ఆహార పదార్ధాలు, కాలుష్యం, నిద్ర లేమి కారణంగా ముఖంపై ముడతలు ఏర్పడం, నిగారింపు కోల్పోవడం, పింపుల్స్ ఏర్పడటం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. ఈ సమస్య ఇటీవలి కాలంలో చాలా సహజంగా మారింది. ముఖ్యంగా యుక్త వయస్సులో మహిళలకు ఎక్కువగా ప్రభావితమౌతున్నారు. ఫలితంగా అందం దెబ్బతిని నలుగురిలో అసౌకర్యానికి లోనవుతున్నారు. అంతేకాకుండా ముఖంపై ముడతలు పడటం వల్ల వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు స్పష్టంగా కన్పించేస్తున్నాయి. సాధారణంగా వయస్సు 50-60 దాటాక గానీ ముఖంపై ముడతలనేవి కన్పించవు. కానీ చెడు జీవనశైలి ఇతరత్రా కారణాలతో తక్కువ వయస్సుకే ఈ సమస్య ఏర్పడుతోంది. వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు దూరం చేయాలంచే డైట్ నుంచి కొన్ని ఆహార పదార్ధాలు దూరం చేయాలి. ఆ వివరాలు మీ కోసం..
షుగర్ లేదా స్వీట్స్
షుగర్ అనేది ఆరోగ్యానికే కాకుండా చర్మాన్ని కూడా నష్టపరుస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే చర్మాన్ని యౌవనంగా ఉంచాలంటే స్వీట్స్ లేదా షుగర్‌ను ఇవాళే డైట్ నుంచి దూరం చేయాలి
ప్రోసెస్డ్ ఫుడ్
ప్రోసెస్డ్ ఫుడ్స్‌లో సహజంగానే సోడియం, ప్రిజర్వేటివ్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీనివల్ల చర్మంలో వాటర్ రిటెన్షన్, స్వెల్లింగ్, కొలేజన్ లోపం తలెత్తవచ్చు. రోజూ ప్రోసెస్డ్ ఫుడ్ తినేవారి ముఖంపై ముడతల సమస్య ఎక్కువగా ఉంటుంది.
కెఫీన్
కాఫీలో ఉండే కెఫీన్ చర్మం నుంచి తేమను లాగేస్తుంది. అందుకే టీ లేదా కాఫీ తగ్గించాలి. టీ, కాఫీలు తాగేవారిలో ముఖంపై ముడతల సమస్య అధికంగా ఉంటుంది. అందుకే చర్మాన్ని యౌవనంగా ఉంచుకోవాలంటే టీ, కాఫీలు చాలా వరకూ తగ్గించేయాలి.
Also read: Breakfast Diet: రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తినాలి, ఏది తినకూడదో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook