Skin Care Tips For Summer: ఎండాకాలంలో చర్మం తొందరగా టాన్ అవుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా దాని ప్రభావం చర్మంపై పడుతుంది దీంతో చర్మ సమస్యలు సులభంగా వస్తాయి. కాబట్టి చర్మాన్ని ఎండాకాలంలో సంరక్షించుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ఎండలో తిరిగే వారిదైతే చర్మం నలుపు రంగులోకి మారిపోయి డెడ్ స్కిన్ సెల్స్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సౌందర్య నిపుణులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్ ని వినియోగించాల్సి ఉంటుంది.
ఈ చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో తయారు చేసిన ఫేస్ మాస్కులు వినియోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో రసాయనాలతో కూడిన ఫేస్ మాస్కులు లభిస్తున్నాయి. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో చాలా రకాల చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని చర్మం నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటికి బదులుగా నిపుణులు సూచించిన ఈ హోం మేడ్ మాస్కులను వినియోగించాలి. ప్రస్తుతం చాలామంది సౌందర్య నిపుణులు కాఫీ పొడితో తయారుచేసిన ఫేస్ మాస్కులను వినియోగించాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ మాస్కులు ఎలా తయారు చేసుకోవాలో?, ఈ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో?, మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Shaakuntalam OTT Release: నెల తిరక్కుండానే ఓటీటీలోకి శాకుంతలం.. ఎందులో? ఎప్పుడు రిలీజ్ అంటే?
కాఫీ పౌడర్ విత్ పసుపు మిశ్రమం:
ప్రస్తుతం చాలామంది మార్కెట్లో రసాయనాలతో కూడిన ఫేస్ మాస్కులను వినియోగిస్తున్నారు. ఇవి ఖరీదైనప్పటికీ ఎలాంటి ఫలితాలు చర్మంపై చూపలేకపోతున్నాయి. వాటికి బదులుగా కాఫీ పౌడర్ తో తయారు చేసిన ఫేస్ మాస్కులు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని సౌందర్యాన్ని పనులు అభిప్రాయపడుతున్నారు. ఈ మాస్క్ తయారు చేయడానికి ముందుగా మూడు టీ స్పూన్ల కాఫీ పౌడర్ ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక చెంచా పసుపును తీసుకొని ఓ బౌల్లో ఈ రెండింటిని వేసి రోజ్ వాటర్ తో మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టుకొని.. నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఈ ఫేస్ వాష్ ని ముఖానికి అప్లై చేసి.. ఓ 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మానికి యాంటీ ఆక్సిడెంట్లు లభించి ముఖాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. అంతేకాకుండా ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా సంరక్షిస్తుంది.
Also Read: Shaakuntalam OTT Release: నెల తిరక్కుండానే ఓటీటీలోకి శాకుంతలం.. ఎందులో? ఎప్పుడు రిలీజ్ అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook