Samantha Fitness Secret: సమంత ఫిట్‌నెస్ అందం చూసి ఎవరూ ఆమె వయస్సును అంచనా వేయలేరు. ఇటీవలి కాలంలో ప్రమాదకరమైన ఆటో ఇమ్యునో డిజార్డర్ బారిన పడినా ఇప్పటికీ తరగని అందంతో, ఏమాత్రం వయస్సు కన్పించకుండా ఫిట్ అండ్ క్యూట్‌గా కన్పిస్తోంది. ఈ వయసులో సైతం సమంత ఇంత అందంగా కన్పించడానికి కారణమేంటో తెలుసుకుందాం.
దక్షిణాది టాప్ నటి సమంతా ప్రభు వయసు ఇప్పుడు 36 ఏళ్లు. కానీ ఆమె ఫిట్‌నెస్ చూస్తే ఎవరూ నమ్మలేరు. ఎందుకంటే మిళమిళలాడే అందంతో, ఫిట్‌నెస్‌తో ఆమె ఇప్పటికీ 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయిలా కన్పిస్తుంది. యాక్షన్ సినిమా లేదా డ్యాన్స్ ఏదైనా సరే శరీరాన్ని అమె ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుందంటే చూపు తిప్పడమే కష్టమౌతుంది. ఆమె ఇంత ఫిట్‌నెస్‌గా, అందంగా ఉండేందుకు కారణం రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ మాత్రమే. ఈ వ్యాయామంతో పాటే ప్రత్యేకమైన డైట్ కూడా ఫాలో చేస్తుంటుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే వెల్లడించింది. ఆటో ఇమ్యూన్ డైట్ ఫాలో చేసిన తరువాత శక్తి అనేది తిండిని బట్టి కాదు గానీ ఆలోచనను బట్టి ఉంటుందని సమంతా వెల్లడించింది.
ఆటో ఇమ్యూన్ డైట్ అంటే చాలా కఠినమైందే. గూగుల్‌లో దీని గురించి పరిశోధిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడౌతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాది లక్షణాల్ని మెరుగుపర్చడమే ఈ డైట్ ప్రధాన ఉద్దేశ్యం. శరీరంలో ఉండే స్వెల్లింగ్‌ను తగ్గిస్తుంది. ఆటో ఇమ్యూన్ డైట్‌లో ఇన్‌ఫ్లమేటరీ ఆహార పదార్ధాలుండకూడదు. ఆటో ఇమ్యూన్ డైట్ ప్రకారం సీ ఫుడ్స్, మూలికలు, పాలకూర, తోటకూర వంటి ఆకు కూరలు, వాము, బ్రోకలీ, కాలిఫ్లవర్, అరటికాయ వంటివి తీసుకోవాలి. క్యాటర్, బీట్‌రూట్, ఆనపకాయ వంటివి తప్పకుండా ఉండాలి. అవకాడో, నేరేడు, సిట్రస్ ఫ్రూట్స్, ఆపిల్, చెర్రీ, జైతూన్ ఆయిల్ , కొబ్బరి నూనె డైట్‌లో ఉండాలి.
ఆటో ఇమ్యూన్ డైట్ తీసుకునేందుకు నిర్దిష్టమైన సమయం అంటూ ఉండదు. ఆకలిని బట్టి రోజుకు 3-4 సార్లు తినవచ్చు. బ్లడ్ షుగర్ నార్మల్ స్థాయికి తీసుకొచ్చేందుకు రోజంతా నియమిత ఆహారం, అల్పాహారం తీసుకోవాలి. మధ్యలో స్నాక్స్ కూడా తీసుకోవాలి. సమంత ఇంత కచ్చితమైన డైట్, వ్యాయామం నియమాలు పాటిస్తుంది కాబట్టే ఇప్పటికీ ఇంద అందంగా ఉంది.
Also read: Bank Holidays March 2024: మార్చ్ నెలలో 18 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook