Bank Holidays March 2024: మార్చ్ నెలలో 18 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే

Bank Holidays March 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. మరో వారం రోజుల్లో ఫిబ్రవరి నెల ముగియనుంది. మరి మార్చ్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులున్నాయో తెలుసుకుందాం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2024, 07:40 PM IST
Bank Holidays March 2024: మార్చ్ నెలలో 18 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే

Bank Holidays March 2024: ఆర్బీఐ ప్రతి నెలా ఎప్పటికప్పుడు సెలవుల్ని ప్రకటిస్తుంటుంది. ఈ సెలవుల్లో కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఉంటే మరికొన్ని ప్రాంతీయ సెలవులుంటాయి. ఈసారి అంటే మార్చ్ నెలలో బ్యాంకులకు ఏకంగా 18 రోజులు సెలవులున్నాయి. అంటే మార్చ్ నెలలో బ్యాంకులు కేవలం 13 రోజులే పనిచేస్తాయి. మార్చ్ నెల బ్యాంకు సెలవులు ఎప్పుడో చెక్ చేద్దాం.

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. యూపీఐ చెల్లింపులు వినియోగంలో వచ్చాక ఆన్‌లైన్ పేమెంట్స్ మరింతగా పెరిగింది. అయినా సరే కొన్ని పనులు కోసం బ్యాంకుకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరముంటుంది. ఈ నేపధ్యంలో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. ప్రతినెలా నాలుగు ఆదివారాలతో పాటు రెండవ, నాలుగవ శనివారాలు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇవి కాకుండా ఇతర ప్రాంతీయ, జాతీయ సెలవులుంటాయి. ఆర్బీఐ ప్రతినెలా ఈ సెలవుల జాబితాను ప్రకటిస్తుంటుంది. మార్చ్ నెలలో అదే విధంగా 18 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. హోలీ, రంజాన్ వంటి పండుగలు ఇదే నెలలో ఉన్నాయి. 
ఎప్పుడు ఎక్కడెక్కడ సెలవులున్నాయో తెలుసుకుందాం.

మార్చ్ 1న మిజోరాంలో చప్చూర్ కూట్ పండుగ సెలవు
మార్చ్ 3వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
మార్చ్ 6న మహారిషి దయానంద్ సరస్వతి రిస్ట్రిక్టెడ్ సెలవు
మార్చ్ 8 మహా శివరాత్రి సెలవు
మార్చ్ 9న రెండవ శనివారం దేశవ్యాప్తంగా సెలవుట
మార్చ్ 10 ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
మార్చ్ 12 రంజాన్ ప్రారంభం సెలవు
మార్చ్ 17 ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
మార్చ్ 20 మార్చ్ ఈక్వినాక్స్ కొన్ని రాష్ట్రాల్లో సెలవు
మార్చ్ 22 బీహార్ డే సందర్భంగా బీహార్‌లో సెలవు
మార్చ్ 23న భగత్ సింగ్ అమరుడైన రోజు కొన్ని రాష్ట్రాల్లో సెలవు
మార్చ్ 24న హోళికా దహనం పబ్లిక్ హాలిడే
మార్చ్ 25న హోలి పబ్లిక్ హాలిడే
మార్చ్ 26న యావోసంగ్ మణిపూర్‌లో సెలవు
మార్చ్ 28న మౌండీ గురువారం సెలవు
మార్చ్ 29న గుడ్ ఫ్రైడే సెలవు
మార్చ్ 30న నాలుగవ శనివారం సెలవు
మార్చ్ 31న ఈస్టర్ సెలవు

అయితే బ్యాంకులకు సెలవులున్నా సరే ఏటీఎం సేవలు పనిచేస్తాయి. అంతేకాకుండా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా కొనసాగనున్నాయి. బ్యాంకులకు ప్రత్యక్షంగా వెళ్లి చేసుకోవల్సిన పనులు తప్ప మిగిలినవన్నీ పూర్తి చేసుకోవచ్చు.

Also read: Pawan kalyan Comments: వయసు మళ్లిన నేతలు తప్పుకోవాలన్న పవన్ వ్యాఖ్యల వెనుక కారణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News