Tips For Shining Nails: ఈ చిట్కాలతో మీ గోళ్లు అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి

Shining Nails Home Remedies: అందంగా కనిపించడానికి చాలామంది మార్కెట్‌లో లభించే ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే కొందరు ముఖంపై చూపించే శ్రద్ధ గోళ్లపై ఏ మాత్రం చూపించారు.దీని కారణంగా గోర్లు అందవికారంగా కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనే వారు ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల గోళ్లు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2024, 08:01 PM IST
Tips For Shining Nails: ఈ చిట్కాలతో మీ గోళ్లు అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి

Shining Nails Home Remedies: ప్రస్తుతం చాలా మంది గోళ్ల సమస్యతో బాధపడుతుంటారు. గోళ్లు సరిగ్గా పెరగకపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల గోళ్లు ఆరోగ్యంగా మారుతాయి. అలాగే గోళ్లు పొడ‌వుగా కూడా పెరుగుతాయి. గోళ్ల‌ను పెంచుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే  చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్ల నిమ్మరసం తగినంత ఆలివ్‌ నూనె వేయాలి. ఈ రెండిటిని మిక్స్‌ చేసిన మిశ్రమంలో గోళ్లను ముంచి ఐదు నిమిషాల తర్వతా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు పొడ‌వుగా పెరుగుతాయి.

రోజ్‌ వాటర్ మహిళల చర్మ సంరక్షణకు మేలు చేయడమే కాకుండా మీ గోర్లును కూడా అందంగా తయారు చేస్తుంది. ప్రతిరోజు రోజ్‌ వాటర్‌తో గోర్లును మసాజ్‌ చేయడం వల్ల గోళ్లకు అందంగా కనిపిస్తాయి.

ఆల్మండ్​ ఆయిల్‌తో  గోళ్లపై రాసి రెండు మూడు నిమిషాలు మసాజ్‌ చేయండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మెరిసే గోళ్లు మీ సొంతం చేసుకోవచ్చు.

నిమ్మకాయతొక్కలోని సిట్రిక్ యాసిడ్​ గోళ్లను మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని వల్ల గోళ్లపై ఉండే మరకలు తొలగి, సహజమైన మెరుపు లభిస్తుంది. 

 

✩  చేతి గోర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా  చేరకుండా ఉంటుంది.
 

✩  గోర్లు బలంగా ఉండాలి అంటే ఆరెంజ్‌ జ్యూస్ తీసుకుని గోర్లను నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గోర్లు బలంగా, అందంగా ఉంటాయి.

 

✩ కొంతమందిలో తరుచుగా గోళ్లు విరిగిపోతుంటాయి. దీని కోసం గుడ్డు పెంకులు నలగ్గొట్టి పౌడర్ తయారు చేయాలి. దీని నెయిల్ పాలిష్‌లో కలిపి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

Also read: Deep Fried Foods: డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తింటున్నారా..? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News