Always In Fridge: ఈ ఆహారాలను ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే పెట్టాలి.. ఎందుకో తెలుసా?

 Always In Fridge:  కొన్ని రకాల ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. మరికొన్ని ఆహారాలను ఫ్రిజ్‌లోనే పెట్టాలని అంటారు అవి ఏ ఆహారాలు ఏమో తెలుసా?

Written by - Renuka Godugu | Last Updated : Apr 28, 2024, 04:21 PM IST
Always In Fridge: ఈ ఆహారాలను ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే పెట్టాలి.. ఎందుకో తెలుసా?

 Always In Fridge:  కొన్ని రకాల ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. మరికొన్ని ఆహారాలను ఫ్రిజ్‌లోనే పెట్టాలని అంటారు అవి ఏ ఆహారాలు ఏమో తెలుసా?
 యాపిల్స్‌ ఫ్రిజ్‌లో పెడితే అవి ఇథైలిన్‌ గ్యాస్‌ విడుదల చేస్తాయి. దీంతో పక్కన ఉండే ఇతర పండ్లను కూడా త్వరగా మాగేలా చేస్తాయి. అయితే, ఫ్రిజ్లో యాపిల్స్ పెడితే ఇతర పండ్ల పక్కన వాటిని ఉంచకూడదు.

అవకాడో..
అవకాడోలు కూడా ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. ఇవి ఒకవేళ పండకపోతే వాటిని కిచెన్‌ కౌంటర్‌పై నే పెట్టండి.అవి మాగుతాయి. ఒకవేళ ఇవి పండినవే అయితే అవకాడోను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వచేసుకోండి. లేకపోతే అవి త్వరగా బ్రౌన్‌ కలర్‌లోకి మారిపోతాయి.

అరటిపండ్లు..
మనందరికీ తెలిసిన విషయమే అరటిపండ్లు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇవి త్వరగా పండిపోతాయి. వీటిని తప్పకుండా ఫ్రిజ్‌లో పెట్టాల్సి వస్తే కేవలం రెండు రోజులకు మాత్రమే నిల్వ చేసుకోవాలి. లేకపోతే వీటి చర్మం త్వరగా నల్లగా మారిపోతూ ఉంటాయి. లోపలి భాగంలో కుళ్లిపోయే స్థితికి చేరుతుంది.

లెమన్‌ జ్యూస్..
లెమన్ జ్యూస్‌ను ఓపెన్ చేసిన వెంటనే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఒక వేళ ఓపెన్‌ చేసాక బయట పెడితే వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి.  లేకపోతే ఇవి వెంటనే రుచి మారిపోతుంది. సరైన బాటిల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేసుకోవాలి.

కేక్స్..
ఎప్పుడైనా కేకులు తీసుకువస్తే అవి మిగిలిపోతాయి. వాటిని కూడా సరైన కంటైనర్లో పెట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఎందుకంటే కేకులపైనే క్రీమ్‌, కస్టర్డ్‌ చీజ్‌ ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువ శాతం కూల్‌ కేకులే ఉంటాయి. కాబట్టి వాటిని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

ఇదీ చదవండి:వేసవిలో అన్ని అనారోగ్య సమస్యలకు ఒకటే పరిష్కారం.. ఈ ఆకులే!

చాకొలేట్..
డార్క్‌ చాకొలేట్‌  వీటిని చల్లని ప్రదేశాల్లో పెట్టాలి. కొన్ని నివేదికల ప్రకారం చాకొలేట్‌ 21 డిగ్రీల సెల్సియస్‌ మధ్య స్టోర్‌ చేసుకోవాలి. ఇవి బయట పెడితే ఆక్సిడేషన్‌కు గురవుతాయి. చాకొలేట్ ను ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కాలం రుచి మారకుండా ఉంటుంది.

చాకొలేట్‌ సిరప్..
చాకొలేట్‌ సిరప్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. దీన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. లేదంటే దీన్ని రుచి మారడం మీరే గమనిస్తారు.

కోల్డ్ ప్రెస్డ్‌ ఆయిల్..
కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్ రానురాను ఆక్సిడైజేషన్‌కు గురవుతుంది. ఫ్లాక్స్‌ సీడ్‌ ఆయిల్‌ లో అల్ఫా లైనోలెనిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని ఫ్రిజ్‌లోనే నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. 

కార్న్‌..
కార్న్‌ కూరగాయ అందుకే వీటిని కచ్చితంగా ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఇందులో నేచురల్‌ చక్కెర ఉంటుంది. ఇది వెంటనే గంజి తయారు చేసుకోవాలి.

ఇదీ చదవండి:  పుచ్చకాయ, దోసకాయ లేదా బచ్చలికూర? వేసవిలో  హైడ్రేటెడ్‌గా ఉంచేది ఏమిటి?   

డేట్స్..
డేట్స్‌ కూడా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. క్రాన్బెర్రీలు, అప్రికాట్ల మాదిరి కాకుండా వీటిని ఫ్రిజ్‌లో ఎయిర్‌ టైట్‌ కంటైనర్లో నిల్వ చేసుకోవాలి. అవి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటే ఫ్రిజ్‌ లో పెట్టండి.

గుడ్లు..
గుడ్లను స్టెరిలైజ్‌ చేస్తారు. గుడ్డు పెంకుపై ఉండే బ్యాక్టిరియాను నాశనం చేస్తారు. బ్యాక్టిరియాను పేరిపోకుండా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. గుడ్డు చల్లని, తడిలేని ప్రదేశంలో నిల్వ చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News