Thyroid: థైరాయిడ్‌ పేషెంట్స్‌ వేసవిలో తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు, తినాల్సిన ఆహారాలు..

5 Precautions Thyroid Patients Should Take: థైరాయిడ్‌ పేషెంట్స్‌ తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్‌లో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 14, 2024, 02:51 PM IST
Thyroid: థైరాయిడ్‌ పేషెంట్స్‌ వేసవిలో తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు, తినాల్సిన ఆహారాలు..

 

5 Precautions Thyroid Patients Should Take: థైరాయిడ్‌ పేషెంట్స్‌తో బాధపడేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవడం వల్ల ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్య కారణంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఈ కింది 5 జాగ్రత్తల తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిణులు తెలుపుతున్నారు. అయితే ఆ జాగ్రత్తలేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

థైరాయిడ్‌ పేషెంట్స్‌ తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు:
మందులు: 

డాక్టర్‌ సూచించిన మందులను సక్రమంగా, సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డోసు మార్చుకోవడం లేదా మందులు ఆపడం వంటివి చేయడం వల్ల థైరాయిడ్ తీవ్రతరం అయ్యా అవకాశాలున్నాయి.

ఆహారం:
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఐయోడైజ్డ్‌ ఉప్పు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు, మాంసం వంటివి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామం: 
తీవ్ర థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. ఈ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు సైక్లింగ్ తో పాటు వాకింగ్, స్లిమ్మింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు.

బరువు:
థైరాయిడ్‌ ఉన్నవారిలో బరువు పెరగడం సాధారణం. కాబట్టి పెరుగుతున్న బరువును సులభంగా నియంత్రించుకునే పద్ధతులను అనుసరించడం ఎంతో మేలు. అంతేకాకుండా ఈ సమయంలో డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు.

మానసిక ఒత్తిడి: 
థైరాయిడ్ ఉన్న వారిలో తరచుగా మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కోపం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో యోగాతో పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశాలున్నాయి. దీనికి కారణంగా మూడ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది.

థైరాయిండ్‌ పేషెంట్స్‌ తీసుకోవాల్సిన 5 ఆహారాలు
అయోడిన్‌ అధికంగా ఉండే ఆహారాలు:
అయోడైజ్డ్ ఉప్పు

చేపలు (ముఖ్యంగా సాల్మన్, ట్యూనా)
పాలు, పాల ఉత్పత్తులు
గుడ్లు
సీవీడ్

ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలు:
పండ్లు (ముఖ్యంగా యాపిల్స్, బేరి, నారింజ)
కూరగాయలు (ముఖ్యంగా బ్రోకలీ, క్యారెట్, బ్రస్సెల్స్ మొలకలు)
చిరుధాన్యాలు (ఓట్స్, బ్రౌన్ రైస్)
కాయధాన్యాలు (పప్పులు, శనగలు)

ఆరోగ్యకరమైన కొవ్వులు:
అవకాడో
నట్స్, విత్తనాలు (జీడిపప్పు, అవిసె గింజలు)
ఆలివ్ నూనె
చేపల నూనె

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు:
బెర్రీలు (ముఖ్యంగా బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్)
చాక్లెట్ (డార్క్)
టీ
టర్మరిక్

పుష్కలంగా నీరు:
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం.
రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం మంచిది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News