Best Face Massage For Glowing Skin: చర్మం మెరుపును పెంచడానికి చాలా మంది వివిధ క్రీములు, ప్రొడెట్స్ ఉపయోగిస్తారు. అయితే దీని వల్ల కొంత మెరుపు లభించిన కొంత వరకే ఈ మెరుపు ఉంటుంది. అయితే ఎలాంటి ప్రొడెట్స్ లేకుండా సహజంగా మెరుపును పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన చర్మం మెరుపును పెంచాలి అంటే శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చర్మంలో రక్త ప్రసరణ పెరిగిన వెంటనే చర్మంలో మెరుపు కనిపిస్తుంది.
అయితే చర్మ కాంతి పెంచడానికి మీరు ఎలాంటి ఫేస్ ప్రొడెట్స్, క్రీములు, మందులు వాడాల్సిన అవసరం లేదు దీని కోసం మీరు కేవలం కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. కేవలం ఐదు నిమిషాల ఫేషియల్ మసాజ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు.
ఫేషియల్ మసాజ్ అనేది ఆయిల్ సహాయంతో చేసే ఒక రకమైన ఫేస్ మసాజ్. అందంగా కనిపించేందుకుఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవసరం లేకుండా మీరు కేవలం ఫేస్ మసాజ్‌లు చేస్తే సరిపోతుంది.
అయితే ఫేషియల్ మసాజ్ చేసుకొనే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫేషియల్ మసాజ్ చేయడానికి ముందు మీరు ముఖాన్ని నీళ్లుతో శుభ్రం చేసుకోవాలి. మీ ముఖం మీద ఎలాంటి మేకప్ ఉండకుండా చేసుకోవాలి. ఫేస్ వాష్, వాటర్ సహాయంతో మీరు మేకప్‌ను శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. అలాగే జుట్టుని వెనుకకు కట్టుకోవాలి. మీరు ముఖం కడుక్కున్న తర్వాత ఆరనివ్వండి ఆ తరువాత మీరు మసాజ్ చేసుకోవాల
Also Read Korean Drinks: ఈ కొరియన్ టీలు తీసుకోవడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు..
ఫేస్ రోలర్:
ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేస్ రోలర్‌ని ఉపయోగిస్తున్నారు. ముఖం మీద ఉండే కండరాలను సడలించడానికి ఈ ఫేస్ రోలర్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఫేస్ రోలర్ ఉపయోగించటప్పుడు మీరు ముందుగా ముఖాన్ని తేమ చేయడండి. ఫేస్ రోలర్‌ను రాత్రిపూట మాత్రమే వాడండి. దీని వల్ల ముఖ కండరాలు సక్రమంగా రిలాక్స్ అవుతాయి.
ఫింగర్ టిప్స్ ఉపయోగించడం:
చేతులను మాత్రమే ఉపయోగించి చేసే మసాజ్ ఫింగర్ టిప్స్. ఇలా చేయడం వల్ల చేతుల ఒత్తిడి ముఖంపై తేలికగా ఉంటుంది.మీ చర్మ కణాలు కూడా మరమ్మతులు చేయడం ప్రారంభిస్తాయి. మసాజ్ చేసే ముందు, ఫేస్ మాయిశ్చరైజర్‌ని ఉపయోగించడం చాలా మంచిది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Glowing Skin: ఈ ఫేషియల్ మసాజ్ తో కాంతివంతమైన చర్మం మీ సొంతం!