Extincted Creatures: మనిషి మనుగడ కోసం ప్రకృతిని చంపేస్తున్నాడు. మనిషి బతకడం కోసం విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నాడు. ఫలితంగా సృష్టిలో జీవులు అంతరిస్తున్నాయి. అంతరిస్తున్న జీవుల జాబితాలో కొత్తగా 23 జీవులు చేరడం ఆందోళన కల్గిస్తోంది.
సకల చరాచర సృష్టి ఉన్నది భూమిపైనే. ఈ చరాచర సృష్టిలో అధికుడిగా భావిస్తున్న మనిషి చేసే చర్యల కారణంగా ఇతర జీవుల ఉనికి ప్రశ్నార్ధకమౌతోంది. మనిషి తాను బతకడం కోసం ఇతర జీవుల్ని చంపేస్తున్నాడు. మనిషి తన మనుగడ కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. మనిషి తన సౌఖ్యం కోసం విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నాడు. ఫలితంగా ఇతర జీవులు అంతరించిపోతున్నాయి. కొత్తగా 23 జీవులు అంతరిస్తున్న జీవుల జాబితాలో చేరడం ఆందోళన కల్గిస్తోంది. భూమ్మీద అంతరించిన 23 జీవుల కొత్త జాబితాను అమెరికా(America)ప్రకటించింది. ఈ జాబితాలో పండ్లను తిని బతికే గబ్బిలం, పదకొండు రకాల పక్షులు, మంచినీటి ఆల్చిప్పలు, రెండు రకాల చేపలు, పుదీనా జాతికి చెందిన మొక్కలున్నాయని అమెరికా ఇంటీరియర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇంత పెద్ద సంఖ్యలో అంతరించిన జీవుల జాబితా ప్రకటించడం ఇదే తొలిసారి.
కేవంల మనిషి సృష్టిస్తున్న కాలుష్యం(Pollution)కారణంగా ప్రకృతిలో ఏర్పడిన పర్యావరణ మార్పులు, ఆవాసాల ధ్వంసంతో ఆ జీవులు మనుగడ కోల్పోయాయి. మనిషి తలపెడుతున్న చర్యలు మరిన్ని జీవుల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. వన్యజీవుల్ని కాపాడేందుకు మరింత ఉత్సాహంగా, కలసికట్టుగా పనిచేయాలని అమెరికా ఇంటీరియర్ డిపార్ట్మెంట్(America Interior Department)తెలిపింది. 1970 నుంచి పరిశీలిస్తే..ఒక్క ఉత్తర అమెరికాలోనే పక్షుల సంఖ్య 3 బిలియన్లు తగ్గిపోయింది. అమెరికాలో అంతరించిపోతున్న జీవుల చట్టం ప్రవేశపెట్టిన తరువాత ఇతర జీవుల మనుగడలో మెరుగైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రక్షించాల్సిన జాబితాలో ఉన్న 54 జీవుల సంతతి వృద్ధిలో ఉండటంతో జాబితా(Extincted Creatures List) నుంచి తొలగించారు. ఇందులో అమెరికన్ పెరిగ్రిన్ ఫాల్కన్, బాల్డ్ ఈగల్ ఉన్నాయి. ఇవికాకుండా మరో 56 జీవుల్ని అంతరించిపోతున్న జాబితా నుంచి ప్రమాదకర జాబితాకు మార్చారు. ప్రస్తుతం అమెరికాలో ఈ జాబితాలో 16 వందల జీవులున్నాయి.
అంతరించిన జీవుల జాబితాలో ఐవరీ బిల్డ్ వడ్రంగి పిట్ట(Ivory Billed Woodpecker Bird), వీనుల విందైన గొంతు కలిగిన ఓ పిచ్చుక ఉన్నాయి. వడ్రంగి పిట్టను అమెరికన్లు దేవుడి పక్షిగా పిలుస్తారు. కలప వంటి ఇతర అవసరాల కోసం వడ్రంగి పిట్టల ఆవాసాలైన భారీ వృక్షాల్ని కొట్టివేయడంతో ఇవి అంతరించిపోయాయి.1944లో ఈశాన్య లూసియానా ప్రాంతంలో చివరిసారిగా కన్పించింది. ఇక శ్రావ్యమైన గొంతు కలిగిన బాచ్మెన్స్ వార్బ్లెర్ పిచ్చుక చివరిసారిగా 1962లో కన్పించింది. క్యూబాలో ఈ పక్షి చివరిసారిగా 1981లో కన్పించింది.
Also read: Crying Benefits: ఏడుపుతో ప్రయోజనాలేంటో తెలుసా, గుండె జబ్బులు దరి చేరవట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook