Does Water Have Expiration Date, What is Expiry Date of Water: ఈ భూ ప్రపంచంలో మనుషులు తినే లేదా వాడే ప్రతి వస్తువుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ముఖ్యంగా తినే ఆహార పదార్థాల విషయంలో ఎక్స్‌పైరీ డేట్ (తయారీ తేదీ, గడువు తేదీ) చూసిన తర్వాతే మనం దాన్ని వాడుతాం. మనం తినే ప్రతి పదార్థం, వేసుకునే మెడిసిన్, మద్యం బాటిల్స్.. పంట చేనులకు కొట్టే మందులకు సైతం ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయితే మనం ప్రతి రోజూ త్రాగే లేదా ఉపయోగించే నీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? లేదా? అన్న సందేహం అందరిలో ఉంటుంది. కొందరికి ఈ విషయం తెలిసినా.. చాలా మందికి తెలియకపోవచ్చు.
నీటికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అనేక కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని శాస్త్రీయ కారణాల వల్ల సరైనవిగా రుజువు చేయబడితే.. కొన్ని మాత్రమే ఊహించినవి ఉన్నాయి. చాలా మందికి ఉన్న ప్రశ్న మాత్రం ఒక్కటే.. అదే 'నీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా?'. ప్రస్తుతం ఎక్కడ చూసినా వాటర్ బాటిల్‌ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణం నుంచి పల్లె వరకు నీటిని బాటిల్స్ రూపంలో విక్రయిస్తున్నారు. ఆ వాటర్ బాటిల్‌పై ఎక్స్‌పైరీ డేట్ రాసి ఉంటుంది. నీటికి ఎక్స్‌పైరీ డేట్ లేకపోతే.. బాటిల్‌పై ఎందుకు రాసి ఉంటుంది అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. దీనికి సమాధానమే ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి వాటర్ బాటిల్‌పై రాసి ఉన్న ఎక్స్‌పైరీ డేట్.. నీటికి కాదట. ఆ ఎక్స్‌పైరీ డేట్ వాటర్ బాటిల్‌కు అని నిపుణులు చెబుతున్నారు. వాటర్ బాటిల్‌లు ప్లాస్టిక్‌తో తయారు చేయబడతాయి. ఓ నిర్దిష్ట సమయం తర్వాత ఆ ప్లాస్టిక్ నీటిలో నెమ్మదిగా కరిగిపోతుంది. అప్పుడు ఆ నీరు కలుషితం అవుతుంది. ఆలా జరగకుండా ఉండేందుకే వాటర్ బాటిల్‌పై ఎక్స్‌పైరీ డేట్ రాస్తారట. అందుకే వాటర్ బాటిల్ కొన్నాక కచ్చితంగా ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేసుకోవాలి.
నీటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉందా అంటే.. లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. నీరు శుద్ధి చేయడానికి అనేక ప్రక్రియలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే నీటిని ఒకే చోట ఎక్కువ సేపు నిల్వ ఉంచితే.. దానిని తాగే ముందు శుభ్రం చేయడం లేదా శుద్ధి చేయడం తప్పనిసరి అని చెబుతున్నారు. చివరగా నీటిని ఎక్స్‌పైరీ డేట్ లేదని నిపుణులు అంటున్నారు.
Also Read: Samyuktha Menon: ట్రెడిషనల్ వేర్‌లో సంయుక్త మీనన్.. సార్ హీరోయిన్ గ్లామర్‌కి యువత ఫిదా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.