Weight Loss Tip: నీళ్లు తాగితే కూడా బరువుతగ్గొచ్చు.. వాటర్ డైట్ ఎలా చేయాలంటే!

Water for weight loss: బరువు తగ్గాలి అనుకునేవారు పలు రకాల డైట్స్.. ఫాలో అవుతారు. అయితే సులభంగా మంచి నీటితో బరువు తగ్గొచ్చు అన్న విషయం మీకు తెలుసా? వినడానికి విచిత్రంగా ఉన్న మంచినీటిని సరియైన పద్ధతిలో తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 31, 2024, 08:01 PM IST
Weight Loss Tip: నీళ్లు తాగితే కూడా బరువుతగ్గొచ్చు.. వాటర్ డైట్ ఎలా చేయాలంటే!

Weight loss techniques: ఆరోగ్యానికి మంచినీళ్లు ఎంతో ముఖ్యం అని అందరికీ తెలుసు. రోజు మంచి నీరు నిర్దిష్ట మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. మన శరీరంలో కండరాల పెరుగుదల దగ్గర నుంచి జీర్ణక్రియ మెరుగుగా ఉండడం వరకు.. మంచినీరు ఎంతో అవసరం. ఒక వ్యక్తి త్రాగే నీటి పరిమాణం అతని ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు మంచినీరు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని భావిస్తారు. 

అయితే మనం తీసుకోవలసిన మంచినీరు అనేది మన శరీరం బరువును బట్టి నిర్ణయించబడుతుంది అన్న విషయం మీకు తెలుసా? మనం రోజు తీసుకునే మంచినీరు ఓ క్రమ పద్ధతిలో తీసుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు అన్న విషయం మీకు తెలుసా? అవునండి మంచినీరు తాగుతూ సులభంగా బరువు తగ్గొచ్చు.. మరి అది ఎలాగో తెలుసుకుందాం..

మనం తీసుకునే మంచినీరు జీవక్రియను పెంచుతుంది.. దీని ద్వారా మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అయితే బరువు తగ్గాలి అంటే ఎంత నీరు తీసుకోవాలో అనే దానికి ఒక అంచనా ఉంటుంది. నీరు త్రాగడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.. కాబట్టి తక్కువ మోతాదులో భోజనం తీసుకుంటాం. అయితే ఈ మంచినీరు మీరు భోజనంతో పాటు తీసుకోకూడదు.. ఏదైనా ఆహారం తినడానికి అరగంట ముందు ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాసు వరకు మంచినీరు త్రాగవచ్చు. 

మంచినీరు వల్ల బరువు తగ్గుతాం అని అదే పనిగా మంచినీరు తాగిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పైగా భోజనం చేసిన వెంటనే నీరు తీసుకుంటే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అలాగే బయటకు వచ్చేస్తుంది. అందుకని మనకు త్వరగా ఆకలి అనిపిస్తుంది. అందుకే మనం ఏదైనా తినేటప్పుడు అరగంట ముందు.. తిన్న అరగంట తర్వాత మాత్రమే మంచినీరు తీసుకోవాలి. పైగా వీలైనంతగా గోరువెచ్చటి నీరు తీసుకోవడం వల్ల శరీరంలో పేర్కొన్న కొవ్వు నిల్వలు కరుగుతాయి.

దాహం అనిపించినప్పుడు సోడా, జ్యూస్, పాక్డ్ డ్రింక్స్ తాగడం కంటే కూడా మంచినీరు తీసుకోవడం ఎంతో మంచిది. ఇది మన శరీరంలో అధిక కేలరీలను వెళ్లకుండా నివారించడంతోపాటు ఎప్పటినుంచో స్థిరనివాసం ఏర్పరచుకున్న కొవ్వుని కరిగిస్తుంది. శరీరానికి అవసరమైన మోతాదులో నీరు తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు. అయితే నీటితోపాటుగా తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివి కూడా తగు మోతాదులో తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో నీరు అధిక శాతం లో ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే బరువు తగ్గడం ఎంతో సులభం.

Also read: Cancer Detection: కేన్సర్ నిర్ధారణలో కొత్త ఆవిష్కరణ, రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News