Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెరుగుతున్న బరువును నియంత్రించేందుకు చాలా రకాల వ్యాయమాలు చేస్తున్నారు. కానీ వీటి వల్ల ఆశించిన ఫలితాలు లభించడం లేదు. ఈ కొవ్వును తగ్గించుకునే క్రమంలో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇదే క్రమంలో హెవీ వర్కవుట్స్ కూడా చేస్తున్నారు. ఇది ఆహారపు అలవాట్లతో సమానమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే పలువురు వైద్య నిపుణుల కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్తిమీర ఆకులు శరీరంలో కొవ్వును నియంత్రిస్తాయి:
కొత్తిమీరలో చాలా రకాల పోషకాలుంటాయి. అంతేకాకుండా ఆహార రుచిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇది శరీరాన్ని వివిధ అనారోగ్య సమస్యల నుంచి సంరక్షిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు పొట్ట చుట్టు కొవ్వును నియంత్రించేందుకు దోహదపడతాయి.
ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి కొత్తిమీర రసాన్ని తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని ప్రభావం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొత్తిమీరలో ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. కావున ఇది శరీర బరువును నియంత్రించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగకపోతే పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పెరుగుతుంది. కావున జీర్ణక్రియ మెరుగుదలకు కొత్తి మీర అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇలా రసాన్ని తయారు చేయండి:
కొత్తిమీర రసం తయారుచేయడం చాలా సులభం. దీని కోసం.. కొత్తిమీర ఆకులను నీటిలో రాత్రంతా నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి, ఈ డిటాక్స్ నీటిని త్రాగాలి. అంతే కాకుండా పచ్చి కొత్తిమీరను మెత్తగా నూరి అందులో నిమ్మరసం పిండుకుని తాగవచ్చు.
కొత్తిమీర గింజలు వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు:
కొత్తిమీర గింజల(coriander seeds)ను రాత్రంతా నానబెట్టి వాటిని డ్రైండ్ చేసి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే శరీరాని చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Tulsi Uses And Benefits: తులసి మొక్క తరుచుగా ఎండిపోతుందా.. అయితే ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook