WhatsApp Tricks: నేటి సమాజంలో వాట్సప్ తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్లు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ ఒకటి. ఈ యాప్ వినియోగించే వారు చాటింగ్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు వాట్సప్ సంస్థ యాప్ లో మరికొన్ని మార్పులను తీసుకువచ్చింది. వాస్తవానికి.. వాట్సప్ లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే.. వారికి మెసేజ్ లేదా కాల్ చేసేందుకు అనుమతి లేదు. కానీ, ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి కూడా మెసేజ్ లేదా కాల్ చేసేందుకు అవకాశం ఉంది. కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వడం ద్వారా బ్లాక్ చేసిన వ్యక్తులకు మెసేజ్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
WhatsApp బ్లాకింగ్ ఫీచర్
వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని పదే పదే మెసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెడుతుంటే లేదా ఓ వ్యక్తిని మీరు దూరం పెట్టాలని అనుకుంటే వారిని బ్లాక్ చేసే సదుపాయం ఉంది. అలా చేయడం వల్ల సదరు వ్యక్తి నుంచి మెసేజ్ లు లేదా కాల్స్ రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. అయితే తమను ఎవరెవరు బ్లాక్ చేశారో తెలుసుకునే అవకాశం అయితే ఈ యాప్ లో లేదు.
ఈ ట్రిక్ ఉపయోగించి.. మీరు మెసేజ్ చేయవచ్చు
మీకు తెలిసిన వారు ఎవరైనా వాట్సప్ లో మిమ్మల్ని బ్లాక్ చేశారని మీరు గమనిస్తే.. వారికి మెసేజ్ చేయడం ఇప్పుడు మరింత సులభం. మీరు వాడే వాట్సప్ ను ఒకసారి తొలగించి.. మళ్లీ అదే నంబరు పై తిరిగి వాట్సప్ అకౌంట్ సృష్టించడం వల్ల మీ ఖాతాను వారి అకౌంట్ లో అన్ బ్లాక్ చేయవచ్చు. అదెలా సాధ్యమో తెలుసుకుందాం.
వాట్సప్ ఖాతాను తొలగించాలి..
ముందుగా మీ మొబైల్ లోని వాట్సప్ ఖాతాను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ లోని వెల్లి అకౌంట్స్ ఎంపికపై క్లిక్ చేయాలి. అక్కడ డిలీట్ అకౌంట్ అనే ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం వల్ల మీ వాట్సప్ ఖాతా డిలీట్ అవుతుంది. ఆ తర్వాత అదే నంబరుతో వాట్సప్ లో లాగిన్ అవ్వడం వల్ల మీ ఖాతాను మరోకరి వాట్సప్ ఖాతాలో అన్ బ్లాక్ చేయవచ్చు.
Also Read: Amazon Hitachi AC: సమ్మర్ వచ్చేస్తోంది.. రూ.4,687 ధరకే ఎయిర్ కండిషనర్.. ఈరోజే తుదిగడువు!
Also Read: BSNL Cheapest Plan: BSNL బంపర్ ఆఫర్.. రూ.49 లకే వాయిస్ కాలింగ్, హైస్పీడ్ డేటా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook