White Hair To Black Hair Naturally: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉసిరికాయలు ప్రతిరోజు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో విటమిన్ ఈ, విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని కాకుండా జుట్టును కూడా బలంగా చేసేందుకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి జుట్టుకు పోషణ అందించి సంరక్షిస్తుంది. ఉసిరికాయలో ఉండే మెలనిన్ తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ కు బదులు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఉసిరికాయల నూనె ను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నూనె ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ
ఆమ్లా హెయిర్ ఆయిల్ తయారీకి విధానం:
ఈ నూనెను తయారు చేయడానికి ముందుగా 10 నుంచి 15 వరకు ఉసిరికాయలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా తీసుకున్న తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టిన తర్వాత వాటిని పొడిలా తయారు చేసుకోవాలి.
ఇలా పొడిలా తయారు చేసుకున్న తర్వాత.. 200 ml కొబ్బరి నూనెను తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి.
ఇలా బౌల్లో పోసుకున్న తర్వాత సన్నని సెగ గల మంటపై పెట్టుకోవాలి. ఆ నూనె గోరువెచ్చగా అయిన తర్వాత అందులో పొడిలా చేసుకున్న ఉసిరిని వేయాల్సి ఉంటుంది.
ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించి నూనె ను పక్కకు పెట్టుకొని.. ఒక జార్లో వడపోసుకొని భద్రపరచుకుంటే అంతే సులభంగా ఆమ్లా హెయిర్ ఆయిల్ రెడీ అయినట్లే..
ఈ నూనెను జుట్టుకు అప్లై చేసుకునే విధానం:
ఆమ్లా హెయిర్ ఆయిల్ ని జుట్టుకు అప్లై చేసుకోవడానికి ముందుగా జుట్టుని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా శుభ్రపరచుకున్న తర్వాత జుట్టుకు నూనెను అప్లై చేసి ఒక గంట సేపు అలానే వదిలేయాలి.
ఇలా వదిలేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మసాజ్ చేసి ఆర్గానిక్ షాంపుతో తలస్నానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?
Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి