White Hair to Black in 30 Min: 30 నిమిషాల్లో ఎంతటి తెల్ల జట్టైనా నల్లగా మార్చే శాశ్వత పరిష్కారం.. మరేందుకు ఆలస్యం ట్రై చేయండి!

White Hair To Black in 30 Minutes: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ కింద పేర్కొన్న సహజ హెయిర్ మాస్క్ వినియోగించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2023, 09:40 AM IST
White Hair to Black in 30 Min: 30 నిమిషాల్లో ఎంతటి తెల్ల జట్టైనా నల్లగా మార్చే శాశ్వత పరిష్కారం.. మరేందుకు ఆలస్యం ట్రై చేయండి!

White Hair to Black Permanently Just In 30 Minutes: చిన్న వయస్సులో తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది బట్టతల సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అనుసరించే జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తెల్ల జుట్టుతో పాటు ఇతర వెంట్రుకల సమస్యలు కూడా వస్తాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే పలు రకాల ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించకుండా ఆయుర్వేద నిపుణులు సూచించి సహజమైన హెయిర్ మాస్క్‌ను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది గ్రే హెయిర్ గ్రే హెయిర్ మార్చడమేకాకుండా జుట్టు సమస్యల నుంచి ప్రభావవంతంగా సహాయపడుతుంది.

 అసమతుల్య ఆహారం వల్ల చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి డైట్‌లో ఫాస్ట్ ఫుడ్, వైట్ ఫ్లోర్ డిష్‌లు, ఎరేటెడ్ డ్రింక్స్, షుగర్ ఉండే ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా విటమిన్ బి12, ఐరన్, ఒమేగా 3 సమృద్ధిగా ఉండే డైట్‌ను ఎంచుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా పచ్చి కూరగాయలతో తయారు చేసిన సలాడ్స్‌ వినియోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడేవారు సలాడ్‌లు, చేపలు, చికెన్ వంటి లీన్ మాంసాలు, పండ్లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది ఆల్కాహాల్‌ తీసుకుంటున్నారు. అయితే దానికి బదులుగా కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు, మజ్జిగ, తాజా పండ్ల రసాలను తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా విటమిన్ సప్లిమెంట్లను తీసుకోండి. క్రమం తప్పకుండా హెయిర్ మాస్క్‌ వినియోగించడం చాలా మంచిది. కాబట్టి తెల్ల జుట్టు తిరిగి నలుపు-గోధుమ రంగు రావాలంటే ఏ హెయిర్ మాస్క్‌ను వినియోగించాలో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

సహజ హెయిర్ మాస్క్:
హెర్బల్ మాస్క్ మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా 1 టీస్పూన్ ఉసిరి పొడి, 2 టీస్పూన్లు బ్లాక్ టీ, 1 టీస్పూన్ స్ట్రాంగ్ కాఫీ, 1/2 అంగుళాల కాటేచు, 1 టీస్పూన్ వాల్నట్ బెరడు, 5 టీస్పూన్ల ఇండిగో పౌడర్, 5 టీస్పూన్లు హెన్నా, 1 టీస్పూన్ బ్రహ్మి పౌడర్, 1 టీస్పూన్ త్రిఫలాలను తీసుకోండి. వాటన్నింటినీ నీటిలో కలపండి. మిశ్రమంగా తయారయ్యేదాకా మంటపై మరిగించాలి. ఆ తర్వాత జుట్టుకు అప్లై చేసి 30 నుండి 55 నిమిషాల  పాటు ఉంచాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేస్తే మంచి త్వరలోనే మంచి ఫలితాలు పొందొచ్చు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Inter Exams 2023: ఇవాళ్టి నుంచే ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షలు

Also Read: Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్‌ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News