Yellow Colour Urine Causes In Telugu: వేసవిలో చాలా మందిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వాతావరణంలోని వేడి తీవ్ర పెరిగి డిహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా కొంతమందిలో మూత్రంలో మంట, ఇతర రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తున్నాయి. నిజాని ఎండా కాలంలో నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలోని నీరు చమట రూపంలో బయటి వస్తోంది. దీని కారణంగా శరీరంలో నీటి కోరత ఏర్పడి మూత్రపిండాలపై ప్రభావం పడుతోంది. దీంతో మూత్రంలో అనేక మార్పులు వస్తున్నాయి. అయితే మూత్రంలో కనిపించే మార్పులపై తప్పకుండా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్‌లో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూత్రం రంగు మారడానికి గల కారణాలేంటో, దీని కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రం పసుపు రంగులోకి మారడానికి ప్రధాన కారణాలు:
ఆహారం, సప్లిమెంట్లు:
వేసవి కాలంలో చాలా మందిలో ఆహారం, సప్లిమెంట్ల వల్ల మూత్రం రంగు మారే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మరికొంతమందిలోనైతే విటమిన్ బి మాత్రలు వేసుకోవడం, ఎక్కువ క్యారెట్లు తినడం వల్ల కూడా మూత్రం పసుపు రంగులోకి వస్తోంది.
హిమోగ్లోబిన్ సమస్యలు:
శరీరంలోని ఎర్ర రక్త కణాల నుంచి హిమోగ్లోబిన్ స్థాయిలు ఘనంగా తగ్గడం వల్ల కూడా మూత్రం రంగులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మళ్లీ వీటి సంఖ్య పెరిగినప్పుడు మూత్రం ముదురు రంగులోకి మారుతుంది.
కాలేయ సమస్యలు:
ప్రస్తుతం చాలా మందిలో కాలేయం, మూత్రపిండాల వ్యాధుల కారణంగా కూడా మూత్రం రంగు మారుతోందని వైద్యులు తెలుపుతున్నారు. కొంతమందిలో కామెర్ల కారణంగా కూడా మూత్రం పసుపు రంగులోకి మారుతోందని నిపుణులు చెబుతున్నారు.
ఇది తప్పనిసరి:
మూత్రం ముదురు రంగులోకి మారి శరీర నొప్పులతో బాధపడుతుంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మూత్రం పసుపు రంగులోకి మారే 5 సంకేతాలు ఇవే:
మూత్రం ఎక్కువగా సన్నగా, పసుపు రంగులో వస్తే ఇది కూడా దీర్ఘకాలికంగా పసుపు రంగులోకి మారే సంకేతంగా చెప్పవచ్చు.
కొన్ని సందర్భాల్లో మూత్రం పసుపు రంగులోకి మారితే చర్మం కూడా మారుతుంది.
మరికొంతమందిలోనైతే మూత్రం పనులు రంగులో రావడం వల్ల తల నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మూత్రం రంగు మారడం వల్ల పొట్ట నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి