Parakramam: బండి సరోజ్ కుమార్ 'పరాక్రమం' మూవీ నుంచి ఆకట్టుకుంటున్న ‘మనిషి నేను’ పాట విడుదల..

Parakramam : బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’.  ఈ చిత్రంలో శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మనిషి నేను పాట విడుదల చేసారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 19, 2024, 09:00 PM IST
Parakramam: బండి సరోజ్ కుమార్ 'పరాక్రమం' మూవీ నుంచి ఆకట్టుకుంటున్న ‘మనిషి నేను’ పాట విడుదల..

Parakramam: బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) బ్యానర్ పై  బండి సరోజ్ కుమార్ హీరోగా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘పరాక్రమం’. ఈ చిత్రంలో శృతి సమన్వి  నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. వచ్చే నెలఆగస్టులో గ్రాండ్ గా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.  అయితే ఈ సినిమాకు బండి సరోజ్ సంగీతం కూడా అందించడం విశేషం. ఈ సినిమా కోసం సరోజ్ కుమార్ స్వరపరిచిన 'మనిషి నేను' అనే లిరికల్ వీడియో పాట సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేసారు. హైమత్ మహమ్మద్ ఈ పాటకి తన గాత్రాన్ని అందించారు.

Add Zee News as a Preferred Source

ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ..
 ‘పరాక్రమం’ చిత్రం నుంచి నేను రాసి స్వరపరిచిన 'మనిషి నేను' అనే పాటను సోషల్ మీడియా లో విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు.  ఈ పాటని హైమత్ మహమ్మద్ అద్భుతంగా  పాడిన విషయాన్ని ప్రస్తావించారు. నా పాట అందరికి నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. మా చిత్రాన్ని ఆగష్టు లో విడుదల చేస్తున్నట్టు చెప్పారు.  త్వరలోనే ట్రైలర్ తో మీ ముందుకు వస్తాని చెప్పుకొచ్చారు.  

నటీనటులు : బండి సరోజ్ కుమార్, శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శశాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ తదితరులు

టెక్నికల్ టీమ్  ఈ సినిమాను  బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ సినిమాను కథ, కథనం, మాటలు,ఎడిటర్, సంగీతం, లిరిక్స్, నిర్మాత, దర్శకుడు - బండి సరోజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడం విశేషం. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ - వెంకట్ ఆర్ ప్రసాద్ అందించారు. సౌండ్ డిజైన్ మరియు మిక్సింగ్ : కాళీ ఎస్ ఆర్ అశోక్,కలరిస్ట్ - రఘునాథ్ వర్మ,ఆర్ట్ : ఫణి మూసి,ఫైట్స్ - రాము పెరుమాళ్ల,
డ్యాన్స్ - రవి శ్రీ అందించారు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News