My Dear Donga Success Meet: సూపర్ రెస్పాన్స్‌తో ప్రముఖ ఓటీటీలో దూసుకుపోతున్న అభినవ్ గోమటం 'మై డియర్ దొంగ' మూవీ..

My Dear Donga Success Meet: తెలుగులో సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న నటుడు 'మై డియర్ దొంగ'. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి లీడ్ రోల్లో యాక్ట్ చేసారు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలై సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 2, 2024, 11:36 AM IST
My Dear Donga Success Meet: సూపర్ రెస్పాన్స్‌తో ప్రముఖ ఓటీటీలో దూసుకుపోతున్న అభినవ్ గోమటం 'మై డియర్ దొంగ' మూవీ..

My Dear Donga Success Meet: అభినవ్ గోమం టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'మై డియర్ దొంగ'. ఇందులో షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని ఆహా, కేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మించారు. షాలిని కొండేపూడి ర‌చనలో  బి.ఎస్‌.స‌ర్వ‌జ్ఞ‌కుమార్ డైరెక్షన్ చేశారు.

నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. మై డియర్ దొంగపై చాలా నమ్మకంగా ఉన్నాము. మా నమ్మకమే నిజమైంది. సినిమా చూసిన వారంత ఈ సినిమా చూసి అభినందిస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ వర్గాల నుంచి  కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూడని ఆడియన్స్‌ ఈ సినిమా  చూడండి అంటూ చెప్పుకొచ్చారు.

నటుడు నిఖిల్ మాట్లాడుతూ.. ఇది ఫస్ట్ రిలీజ్. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందం కలుగుతోంది. అభినవ్, శాలినితో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు మరిచిపోలేని అనుభూతి ఇచ్చింది.  

యాక్టర్ స్నేహల్ మాట్లాడుతూ..ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంది. ఈ సినిమాను ఆదిరిస్తోన్న ప్రేక్షకులుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
 

దర్శకుడు బీఎస్ సర్వాంగ కుమార్ మాట్లాడుతూ.. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అభినవ్ గోమటంతో పాటు చిత్ర నిర్మాతలకు, ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ టీమ్‌తో మళ్లీ కలిసి వర్క్ చేయాలని ఉందన్నారు.
 
ఆహా మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ మాట్లాడుతూ.. 'మై డియర్ దొంగ' ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఆహా ఓటీటీలో ఈ సినిమాను 25 లక్షల మంది చూసినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు ఆహా టీమ్ నుంచి శ్రావణి మాట్లాడుతూ.. ఆహా కంటెంట్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యావాదాలు. అభినవ్, శాలిని టీమ్ పెట్టిన ఎఫర్ట్ చాలా బాగుంది. అందుకే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తోందన్నారు.

 
హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ..‘‘ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లుకు  ధన్యవాదాలు. మా సినిమాని ఇంత చక్కగా ఆడియన్స్ ముందుకు తీసుకెలుతున్న మీడియాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News