Saranga Dariya Movie Review: ‘సారంగదరియా’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

Saranga Dariya Movie Review: రాజా రవీంద్ర ముఖ్యపాత్రలో నటించిన ‘సారంగదరియా’. తన కెరీర్ లో చేయనటువంటి డిఫరెంట్ పాత్రలో తొలిసారి కనిపించిన రాజా రవీంద్ర ఈ సినిమాతో మెప్పించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 12, 2024, 04:12 PM IST
Saranga Dariya Movie Review: ‘సారంగదరియా’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

రివ్యూ: సారంగదరియా
నటీనటులు: రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కాదంబరి కిరణ్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్,హర్షవర్ధన్ తదితరులు
ఎడిటర్: రాకేష్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: సిద్ధార్ధ్ స్వయంభు
మ్యూజిక్: ఎం.ఎబెనెజర్ పాల్
నిర్మాత: ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి
దర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి

పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి నిర్మించిన సినిమా ‘సారంగదరియా’. రాజా రవీంద్ర లీడ్ రోల్ల్ యాక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.‘భారతీయడు2’ వంటి భారీ సినిమాతో పోటీకి థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా  ఆడియన్స్ ను మెప్పించిందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

కృష్ణ కుమార్ (రాజా రవీంద్ర) ఓ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కరితో ఒక్కో ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తుంటాడు కృష్ణ కుమార్. మొత్తంగా అంతులేని కథలా సాగుతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. దాంతో వీరి జీవితాలు మారిపోతాయి. అంతేకాదు పిల్లల జీవితాల్లో ప్రేమ వ్యవహారాలు.. వీరి కుటుంబంలో ఎలాంటి చిచ్చు రేపింది.  ఈ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు చెల్లాచెదురుగా ఉన్న ఫ్యామిలీని కృష్ణ కుమార్ చివరకు ఎలా ఒక్కటిగా చేయడానికి ఎలాంటి ప్రయత్నలు చేసాడనేదే  ‘సారంగదరియా’ మూవీ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ సినిమా సబ్జెక్ట్.. మనం ఎపుడో బీసీకాలం నాటి స్టోరీ. కథ పాతదే అయినా.. దాన్ని తెరకెక్కించిన విధానంతో దర్శకుడు పద్మా అబ్బిశెట్టి తనదైన మార్క్ చూపించాడు. ఓ కుటుంబంలో పిల్లలు చెడు తిరుగుళ్లతో తండ్రి, తల్లి ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తారనేది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసాము. దాన్ని కన్విన్స్ గా ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. మొత్తంగా ఓ కుటుంబంలో జరిగే స్టోరీలో ఎమోషన్స్ క్యారీ చేయడం వంటివి ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు. శతమానం భవతి తర్వాత ఆ రేంజ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ గా  కనెక్ట్ అవుతుందనే చెప్పాలి. మొత్తంగా కుటుంబ నేపథ్యానికి కమర్షియల్ అంశాలు జోడించడం ఈ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి.  

సారంగదరియా సినిమాలో దర్శకుడు జీవిత పాఠాలు చెప్పే ప్రయత్నం చేసాడు. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనేది పక్కనపెడితే.. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ .. హీరో కుటుంబాన్ని పరిచయం చేయడం.. వారి హావభావాలను చూపించడం  వరకే పరిమితమైంది. మొత్తంగా ఈ  సినిమాలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మత మార్పిడుల అంశాన్ని కూడా టచ్ చేసారు. మరోవైపు మతాలతో పాటు కులాలను కూడా టచ్ చేయడం విశేషం. మొత్తంగా తాను చెప్పదలుచుకున్న అంశాన్ని నిర్మొహమాటంగా చెప్పాడు దర్శకుడు. ఎడిటర్ సెకాండఫ్ లో తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు
కృష్ణకుమార్ పాత్రలో రాజా రవీంద్ర తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇప్పటి వరకు ఇలాంటి తరహా పాత్రలో రాజా రవీంద్ర చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అలాగే అర్జున్ పాత్రలో నటించిన మెయిన్, సాయి పాత్రలో మోహిత్, మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

 
పంచ్ లైన్.. సారంగదరియా.. ఎమోషన్స్ తో కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ డ్రామా..

రేటింగ్: 2.75/5

Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News