Bloating And Gastric Pain: తరచుగా గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తున్నాయా?, అయితే ఇలా సులభంగా చెక్‌ పెట్టొచ్చు!

Bloating And Gastric Pain: గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ కింద పేర్కొన్న ఆహారాలు అతిగా తినొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర పొట్ట సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి అతిగా తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 25, 2023, 01:52 PM IST
Bloating And Gastric Pain: తరచుగా గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తున్నాయా?, అయితే ఇలా సులభంగా చెక్‌ పెట్టొచ్చు!

Bloating And Gastric Pain: ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా వికారం, ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా చాలా మందిలో గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తింటేనే సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే పొట్ట సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఆహారాలో సులభంగా పొట్ట సమస్యలకు చెక్‌:
రాజ్మాను తినొద్దు:

రాజ్మాలో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఉబ్బరం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఒలిగోశాకరైడ్‌ అనే మూలకాలు కూడా లభిస్తాయి. కాబట్టి దీని కారణంగా జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాజ్మాతో తయారు చేసిన ఆహారాలు అతిగా తినడం మానుకోవాల్సి ఉంటుంది. 

కార్బోనేటేడ్ డ్రింక్స్‌:
కార్బన్ డయాక్సైడ్ అధిక పరిమాణంలో ఉండే పానీయాలను అసలు తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇవి కడుపు లోపల ఒత్తిడిని కలిగించి తీవ్ర వాయువులకు దారి తీస్తుంది. దీంతో ఉబ్బరంతో పాటు తీవ్ర జీర్ణ వ్యవస్థ సమస్యలకు దారీ తీసే ఛాన్స్‌ ఉంది. 

Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో

బ్రోకలీ, క్యాబేజీ:
కడుపులో గ్యాస్ సమస్యలతో బాధపడేవారు బ్రోకలీ, క్యాబేజీ కలిగిన ఆహారాలను ఎలాంటి పరిస్థితుల్లో తినొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో చక్కెర పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి తీవ్ర ఉబ్బరం సమస్యలకు దారీ తీయోచ్చు.  

ఉల్లిపాయ వల్ల కూడా పొట్ట సమస్యలు రావొచ్చు:
కూరగాయల రుచిని పెంచడానికి ఉల్లిపాయలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే పొట్ట సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయను అతిగా తినడం వల్ల గ్యాస్ లేదా ఉబ్బరం సమస్యలకు దారి తీసే ఛాన్స్‌ ఉంది. 

సలాడ్లు:
పచ్చి కూరగాయలు లేదా సలాడ్లను అతిగా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగిన పొట్ట సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సలాడ్లలో అధిక పరిమాణంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. 

Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News