How To Stop Hair Fall 2 Days: ఆధునిక జీవనశైలి, రకరకాల ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. మరికొందరిలో వాతావరణం లో కాలుష్యం పెరగడం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాతావరణం లో తేమ విచ్చలవిడిగా పెరగడం కారణంగా చుండ్రు, జిడ్డు జుట్టు, తెల్ల జుట్టు, జుట్టు సన్నబడడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి ఎంత త్వరగా ఉపశమనం పొందితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు లేకపోతే జుట్టు సమస్యలు పెరిగి బట్టతల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉండే టమోటాలను హెయిర్ మాస్క్ గా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని మెరిపించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయని సౌందర్యాన్ని పనులు చెబుతున్నారు. అయితే ఈ మాస్క్ ను ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టొమాటో హెయిర్ మాస్క్ చేయడానికి కావలసిన పదార్థాలు:
ఒక కప్పు టొమాటో ముక్కలు
50 ఎంఎల్ నీరు
50 ఎంఎల్ రోజ్ వాటర్
హెయిర్ మాస్క్ తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు టొమాటో ముక్కలను తీసుకొని పక్కన పెట్టాల్సి ఉంటుంది.
అలా తీసుకున్న ముక్కలను గ్రైండర్ జార్లో వేసి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా సిద్ధం చేసుకున్న మొక్కలను మిక్సీలో నున్నగా పేస్టులా తయారు చేసుకోవాలి.
ఇలా పేస్టులా తయారు చేసుకున్న దాంట్లో పైన పేర్కొన్న రోజు వాటర్, నీటిని రెండింటిని కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని జుట్టుకు అప్లై చేయాల్సింది.
Also Read: Hyderabad Bangles Market: గాజుల షాపింగ్‌కు ఇక్కడికి వెళ్లండి.. అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి
ఈ హెయిర్ మాస్క్ ను జుట్టుకి ఎలా అప్లై చేయాలో తెలుసా?:
ఈ హెయిర్ మాస్క్ ను అప్లై చేయడానికి ముందుగా జుట్టును బాగా శుభ్రంగా చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా శుభ్రం చేసుకున్న జుట్టును పొడిగా ఆరనివ్వాలి.
ఆరిన తర్వాత జుట్టుకు ఈ మాస్క్ ను అప్లై చేసి పది నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
ఆ మాస్క్ ఆరిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
క్రమం తప్పకుండా దీనిని వినియోగించడం వలన జుట్టుకు యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అంది తెల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి
(Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad Bangles Market: గాజుల షాపింగ్‌కు ఇక్కడికి వెళ్లండి.. అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook