Indian Railway Rules: ట్రైన్ టైమ్ కంటే ముందు వచ్చినా ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవాలా..? ఫైన్ ఎంత కట్టాలి..?

Platform Ticket Rules: ట్రైన్ టైమ్ కంటే ముందు వచ్చినా ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవాలా..? రైలు టికెట్ ఉంటే సరిపోతుందా..? ఎన్ని గంటల ముందు స్టేషన్‌కు చేరుకోవచ్చు..? ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోకపోతే ఫైన్ ఎంత కట్టాలి..? పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : May 11, 2023, 09:13 AM IST
Indian Railway Rules: ట్రైన్ టైమ్ కంటే ముందు వచ్చినా ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవాలా..? ఫైన్ ఎంత కట్టాలి..?

Platform Ticket Rules: మన దేశంలో ప్రయాణానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది రైళ్లకే. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారు.. రైలు జర్నీకే ఇష్టపడతారు. టికెట్ ధర తక్కువ ఉండడంతోపాటు సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చని రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. చాలా ముందుగా టికెట్ బుక్ చేసుకుని తమ ప్రయాణాలను పక్కగా ప్లాన్ చేసుకుంటారు. జర్నీ ఎంత ప్లాన్ చేసుకున్నా.. ట్రైన్ సమయానికి స్టేషన్‌కు చేరుకోకపోతే రైలు వెళ్లిపోతుంది. అందుకే చాలామంది ట్రైన్ సమయానికి కంటే ముందుగానే ప్లాట్‌ఫారమ్‌ వద్దకు చేరుకుని రైలు కోసం ఎదురుచూస్తారు. అయితే ట్రైన్ సమయానికి ఎంత ముందు రావాలి..? ప్లాట్ ఫారమ్ టికెట్ తీసుకోవాలా..? అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. 

రైలులో ప్రయాణించడానికో.. లేదా బంధువులు, ఫ్రెండ్స్‌ను ట్రైన్ ఎక్కించడానికి చాలామంది రైల్వే స్టేషన్‌కు వస్తుంటారు. ఒక్కోసారి హడావుడిగా వచ్చి.. ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవడం మర్చిపోయి టీసీకి దొరికిపోతుంటారు. మరికొంత మంది ట్రైన్ రావడానికి కంటే చాలా ముందుగా స్టేషన్‌కు వచ్చి టీసీలకు దొరికిపోతుంటారు. మీరు ట్రైన్ టికెట్ తీసుకున్నా.. రైలు కంటే రెండు గంటల ముందే స్టేషన్‌కు వస్తే ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవాలి. లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  

మీ రైలు డే టైమ్‌లో ఉంటే.. మీరు రైలు సమయానికి 2 గంటల ముందు స్టేషన్‌కు చేరుకోవచ్చు. ఒకవేళ మీ రైలు రాత్రి సమయంలో ఉంటే.. మీరు రైలు సమయానికి 6 గంటల ముందు స్టేషన్‌కు చేరుకోవచ్చు. ఇలా వస్తే ఎలాంటి జరిమానా ఉండదు. టీటీఈ వచ్చిన టికెట్ అడిగినా.. ట్రైన్ టికెట్ చూపిస్తే సరిపోతుంది. అయితే నిర్ణీత సమయానికి కంటే ఎక్కువగా రైల్వే స్టేషన్‌లో ఉంటే.. మీరు ప్లాట్‌ఫారమ్‌ టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పగటిపూట రైలు సమయం నుంచి 2 గంటల కంటే ఎక్కువ ఉంటే.. రాత్రి రైలు సమయం నుంచి 6 గంటల కంటే ఎక్కువ స్టేషన్‌లో ఉంటే మీరు కచ్చితంగా ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవాలి. 

ఒకవేళ మీరు ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోకపోతే.. టీటీఈ ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. ప్లాట్‌ఫారమ్ టికెట్ వ్యాలిడిటీ కూడా 2 గంటలు మాత్రమే ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి. ప్లాట్‌ఫారమ్ టికెట్ ధర స్టేషన్లను బట్టి మారుతుంటుంది. ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోకపోతే రూ.250 నుంచి రూ.270 జరిమానా చెల్లించాల్సి రావచ్చు. 

Also Read: Karnataka Assembly Elections 2023: ఈ సాలా విక్టరీ నమ్దే.. కర్ణాటకలో నేడే పోలింగ్‌.. ఓటరు తీర్పుపై ఉత్కంఠ..!  

Also Read: IPL 2023 Points Table: టాప్-3లోకి దూసుకువచ్చిన ముంబై.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News