ISKCON Bengaluru Praises 'Ari' movie: సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమా మంచి ఫీల్ ఉన్న సినిమాగా అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఇక అలాంటి సినిమా తర్వాత ఆ సినిమా దర్శకుడు జయశంకర్ అరి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. యాంకర్ అనసూయ, ఆమని, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని ఆర్వి రెడ్డి సమర్పణలో మారెడ్డి శేషు, రామిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు.
వైవిధ్యమైన కాన్సెప్ట్ తో అందరిని ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమాని రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్, మంగ్లీ పాడిన ఒక పాట అదే విధంగా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ చూసిన ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ ఇస్కాన్ బెంగళూరు ప్రెసిడెంట్ కృష్ణ దాస ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read: Ustaad Bhagat Singh: ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్దంటున్న ఉస్తాద్ భగత్ సింగ్
ఈ సినిమాలో శ్రీ కృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ప్రస్తావించడం గురించి మాట్లాడిన ఆయన ఇలా ప్రస్తావించడం అభినందనీయమని అన్నారు. ఇక గతంలో కూడా ఈ సినిమా ట్రైలర్ చూసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సైతం ప్రసంశలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఈ సినిమాలో కృష్ణ తత్వం తెలియజేసే విధంగా ఉన్న చిన్నారి కిట్టయ్య అనే పాటను హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరవ్ చంద్ర దాస విడుదల చేశా.రు ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మంగ్లీ పాడిన ఒక సాంగ్ కి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఇక విడుదలకు ముందే తమ అరి సినిమా మంచి పాజిటివ్ బజ్ సంపాదించడం ఆనందం కలిగిస్తోందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read: Simran Choudhary Photos: షర్ట్ విప్పేసి 'బ్రా' అందాలతో సిమ్రాన్ అరాచకం.. ఈ హీటు తట్టుకోగలరా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook